Valigonda : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

వలిగొండ, మన సాక్షి:

వలిగొండ మండల కేంద్రంలోని హెచ్. పి పెట్రోల్ బంక్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున గస్తీ తిరుగుతున్న పోలీసులకు రోడ్డుపై మృతదేహం కనిపించగా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా ఏఎస్ఐ శ్యాంసుందర్ రెడ్డిసంఘటన స్థలానికి చేరుకుని అంచనామా నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు.

 

మృతుడు హనుమాన్ మాల ధరించినట్టు కాషాయపు రంగు దుస్తులు ధరించి ఉన్నట్లు ఆయన తెలిపారు.