Haliya : మున్సిపాలిటీ కో అప్షన్ సభ్యులు వీరే..!
నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యుల నియామకం జరిగింది. శనివారం హాలియా మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హాలియా మున్సిపాలిటీ కో ఆప్షన్ నూతన సభ్యుల ఎన్నికను మున్సిపల్ కమిషనర్ చేపట్టారు.

Haliya : మున్సిపాలిటీ కో అప్షన్ సభ్యులు వీరే..!
హాలియా, మనసాక్షి :
నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యుల నియామకం జరిగింది. శనివారం హాలియా మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హాలియా మున్సిపాలిటీ కో ఆప్షన్ నూతన సభ్యుల ఎన్నికను మున్సిపల్ కమిషనర్ చేపట్టారు.
మొత్తం నలుగురు సభ్యులకు గాను 28 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రత్యేక కేటగిరి విభాగంలో వర్కాల శేఖర్ రెడ్డి, కొమ్మనబోయిన జయమ్మలను నియమించగా మైనారిటీ విభాగం నుండి రషీద్, చెన్ను రాజేశ్వరిలను నియమించారు.
అంతకు ముందు హాలియా మున్సిపాలిటీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించి సభ్యుల ఎన్నికను చేపట్టారు. నూతనంగా ఎన్నికైన సభ్యులను మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నికైన సభ్యులు హాలియా పట్టణ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల పై కౌన్సిల్ సభ్యులకు తమ సలహాలు సూచనలు అందజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్, కౌన్సిలర్లు నకిరేకంటి అన్నపూర్ణ, చిట్టిపోలు శ్రీదేవి, బొంగరాల యేసు రాజు, చెరుపల్లి ముత్యాలు, గౌహర్ జబీన్, పిల్లి చంద్రకళ, ఎడవల్లి మేరీ, ప్రసాద్ నాయక్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.