తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Miryalaguda : మిల్లర్లు అన్ని రకాల ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడితే చర్యలు.. సబ్ కలెక్టర్ హెచ్చరిక..!

Miryalaguda : మిల్లర్లు అన్ని రకాల ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడితే చర్యలు.. సబ్ కలెక్టర్ హెచ్చరిక..!

మిర్యాలగూడ, (మన సాక్షి) :

రైస్ మిల్లులలో అన్ని రకాల ధాన్యం కొనుగోలు చేయాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ అన్నారు. మంగళవారం వేములపల్లి మండలం శెట్టిపాలెం, మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లి సమీపంలోని పలు రైస్ మిల్లులను సందర్శించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పిస్తూ ప్రతి రైస్ మిల్లు యాజమాన్యం అన్ని రకాల ధాన్యమును కొనుగోలు చేయాలని మిల్లర్స్ అసోసియేషన్ కు తెలిపినట్లు పేర్కొన్నారు.

కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టిన మిల్లు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమును కొనుగోలు చేసినట్లు తెలిపారు. మిర్యాలగూడ పరిధిలోని మిల్లులకు 3000 ట్రాక్టర్ల వరకు దిగుమతి చేసుకొనే కెపాసిటీ ఉందని, అంతకు మించి ధాన్యం వచ్చినప్పుడు మాత్రమే కొంత ఇబ్బంది జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

 

ఒకటి రెండు చోట్ల మినహాయిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం దిగుమతి అవుతుందని రైతులు అధైర్యపడవద్దని సూచించారు. ఇతర జిల్లా నుంచి వచ్చే దాన్యంకు టోకెన్ సిస్టంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సూర్యాపేట, హుజూర్ నగర్ ప్రాంతాల నుంచి వచ్చే రైతులు ఆయా మండలాల వ్యవసాయ అధికారుల వద్ద టోకెన్లు తీసుకొని మిల్లులకు చేరుకోవాలని సూచించారు.

ఇతర జిల్లాల నుంచి వచ్చే దాన్యం ఎంత మొత్తంలో వస్తుందో తెలియకపోవడంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి కూడా ధాన్యం రాకుండా చెక్ పోస్ట్ లను బలోపేతం చేసినట్లు ఆయన తెలిపారు.

మిర్యాలగూడ పరిధిలో 74 కేంద్రాలలో 51 సన్నరకం దాన్యం కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మద్దతు ధర లభించని రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి బోనస్ పొందవచ్చు అని సూచించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు