Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : ధాన్యం కొనుగోలులో మోసాలకు పాల్పడితే చర్యలు.. జిల్లా ఎస్పీ హెచ్చరిక..!

Miryalaguda : ధాన్యం కొనుగోలులో మోసాలకు పాల్పడితే చర్యలు.. జిల్లా ఎస్పీ హెచ్చరిక..!

మిర్యాలగూడ, మన సాక్షి :

రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ హెచ్చరించారు. మంగళవారం మిర్యాలగూడలోని శెట్టిపాలెం సమీపంలో, యాద్గార్ పల్లి సమీపంలో ఉన్న రైస్ మిల్లులలో ఆకస్మిక తనిఖీలు చేశారు.

అదేవిధంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై మిల్లర్లతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. దాంతో పాటు మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు