Narayanpet : రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
Narayanpet : రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండి సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పంట రుణమాఫీ, క్రాప్ బుకింగ్, రైతు భీమ, క్రాప్ డ్యామేజ్ వంటి అంశాల పై అన్ని మండల వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ట్రైనీ కలెక్టర్ గరీమ నరుల, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ , మండల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం
జిల్లా కేంద్రంలోనిజిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యాలయ సిబ్బందికి ప్రజాపాలన దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.
డిపిఆర్ఓ కార్యాలయంలో మంగళవారం డి పి ఆర్ ఓ. ఎం ఏ.రషీద్ సిబ్బందితో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
పోరాటాల పురిటి గడ్డ నల్గొండ జిల్లా.. రజాకార్లను తరిమి కొట్టిన మల్లారెడ్డి గూడెం ప్రజలు..!
Ganesh Laddu : రికార్డ్ బ్రేక్.. రూ.1.87 కోట్లు పలికిన గణేష్ లడ్డు..!
TG News : తెలంగాణలో నూతన విద్యా విధానం.. 2025 నుంచి ఇంటర్ ఉండదు..!
Ration Cards : పేదలకు ఇక సన్న బియ్యం.. ప్రభుత్వ నిర్ణయం, ఎప్పటి నుంచి అంటే..!









