Alert : ఆ నెంబర్ల నుంచి .. వాట్సాప్  కాల్స్ వస్తే.. ఏం చేయాలి..?

Alert : ఆ నెంబర్ల నుంచి .. వాట్సాప్  కాల్స్ వస్తే.. ఏం చేయాలి..?

మనసాక్షి , వెబ్ డెస్క్:

ఇటీవల కాలంలో వాట్సాప్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. అవి కూడా అంతర్జాతీయ కాల్స్ వస్తున్నాయి. గుర్తుతెలియని నెంబర్ ల నుంచి వాట్స్అప్ కాల్ వస్తుంది… వెంటనే కట్ అవుతుంది. ఇలా వాట్సప్ యూజర్లకు ప్రాబ్లం అవుతుంది. కాల్స్ వచ్చే వాటిలో +84 , + 62 , + 60… ఇంకా ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ కాల్స్ వస్తున్నాయి. ఈ కాల్స్ తో చాలామంది యూజర్లు ఆందోళన చెందుతున్నారు.
ఫోన్ కాల్ వస్తే ఎత్తాలా ..?వద్దా..? అని ఆందోళన చెందుతున్నారు.

ఇవన్నీ మలేషియా, ఇండోనేషియా, ఇథియోపియా, కెన్యా, వియత్నం దేశానికి చెందిన కోడ్స్. ఈ కోడ్స్ నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేస్తే ఏమవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాట్సప్ కాల్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదని సైబర్ నిపుణులు, పోలీసులు కూడా చెబుతున్నారు. సైబర్ మోసాలకు ఇదోరకమైన ఎత్తుగడ అని పోలీసులు గ్రామాలలో అవగాహన సైతం కల్పిస్తున్నారు.

 


ఇలాంటి కాల్స్ ఎత్తినా… లింకులు వాట్సాప్ లో వస్తే ఓపెన్ చేసినా… మీ డేటా కానీ, డబ్బులు కానీ దొంగిలించడానికి ఏదైనా మాల్వేర్ ని ఇంజెక్ట్ చేయవచ్చని చెబుతున్నారు.

గుర్తుతెలియని ఫోన్ కాల్స్ వస్తే వాటికి ఆన్సర్ చేయవద్దని అలాంటి కాల్స్ వస్తే కట్ అయ్యాక రిపోర్ట్ చేసి బ్లాక్ చేయాలని సూచిస్తున్నారు. గుర్తు తెలియని నెంబర్ ల నుంచి కాల్స్ వస్తే కూడా లిఫ్ట్ చేయొద్దని పోలీసు వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

సైబర్ మోసగాళ్లు ఇన్ స్టాగ్రామ్ ఎకౌంటు, ఫేస్ బుక్ ఎకౌంటు, ఇతర ఎకౌంట్ ల ద్వారా ఫోన్ నెంబర్లను సేకరించి ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఏది ఏమైనా ప్రజల్లో వాట్సాప్ యూజర్లకు అవగాహణ చాలా ముఖ్యం.