హైదరాబాద్ కు అక్రమంగా పశువుల రవాణా.. !

హైదరాబాద్ కు అక్రమంగా పశువుల రవాణా.. !
చింతపల్లి. మన సాక్షి.
నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధి నుండి ఎలాంటి అనుమతులు లేకుండా మల్లెపల్లి సంతలో పశువు కొనుగోలు చేసి అక్రమంగా హైదరాబాద్ కు తరలిస్తుండగా మండల కేంద్రంలో స్థానిక సాయిబాబా గుడి సమీపంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
మల్లెపల్లి , హాలియా సంత కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులు పశువులను విక్రయిస్తున్నారు. అయితే ప్రతి ఆదివారం సంతలో పశువులను కొనుగోలు చేసి బ్రోకర్లు వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటారు. అందులో భాగంగానే ఆదివారం మల్లెపల్లి ఆలియా సంతలో బ్రోకర్లు కొనుగోలు చేసిన పశువులను హైదరాబాదు తరలిస్తుంటారు.
అదేవిధంగా ఎలాంటి అనుమతులు లేకుండా మల్లెప నుండి హైదరాబాద్ డీసీఎం వ్యాన్లో పశువులను తలెస్తుండగా. చింతపల్లి పోలీసులు స్థానిక సాయిబాబా మందిర గుడి సమీపంలో తనిఖీలు చేపట్టారు.
ఎలాంటి అనుమతులు లేకుండా హైదరాబాద్కు తరలిస్తున్న డీసీఎం వ్యాను పట్టుకొని పశువుతో వెళ్తున్న వ్యాను పోలీస్ స్టేషన్ తరలించారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న పెద్దలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.