బిగ్ బ్రేకింగ్ : ఏపీలో రోడ్డు ప్రమాదం.. దామరచర్ల వాసులు ఆరుగురు మృతి, 9 మందికి గాయాలు

ఏపీలో రోడ్డు ప్రమాదం దామరచర్ల వాసులు ఆరుగురు మృతి, 9 మందికి గాయాలు

పల్నాడు , మన సాక్షి :

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్తున్న కూలీల ఆటో ను లారీ ఢీకొట్టడంతో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

 

సంఘటన స్థలం వద్ద సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతులు తెలంగాణలోని మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలం నర్సాపురం కు చెందిన వారుగా భావిస్తున్నారు. నరసాపురం నుంచి పులిపాడుకు కూలీకి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఆటోలో 23 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తుంది.

మృతుల్లో కూలీలు మంజుల, భూక్య పద్మ,, పానీయ, భూక్యా నాని, మాలావత్ కలిత ఉన్నారు. ఒకరు మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తుండగా మృతి చెందారు. క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.