Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

District collector : జిల్లా కలెక్టర్ వారికి విజ్ఞప్తి.. సమ్మెకు వెళ్లొద్దు..!

District collector : జిల్లా కలెక్టర్ వారికి విజ్ఞప్తి.. సమ్మెకు వెళ్లొద్దు..!

నలగొండ, మన సాక్షి :

పత్తి రైతుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిన్నింగ్ మిల్లుల యజమానులు సమ్మెకు వెళ్లకుండా పత్తి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. పత్తి కొనుగోలులో సిసిఐ తీసుకువచ్చిన ఎల్ 1,2 నిబంధనలు, తేమశాతం, తదితర సమస్యలతో తాము పత్తిని కొనుగోలు చేయలేమని పేర్కొంటూ జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల యజమానులు ఈ నెల 6 నుండి సమ్మె దిశగా వెళ్లేందుకు జిల్లా కలెక్టర్ కు ఇదివరకే నోటీసు అందజేసిన విషయం తెలిసిందే.

ఈ విషయంపై మంగళవారం జిల్లా కలెక్టర్ మార్కెటింగ్, సిసిఐ అధికారులతో పాటు, జిన్నింగ్ మిల్లుల యాజమానులతో తన ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు. పత్తి కొనుగోలులో జిన్నింగ్ మిల్లులకు ఉన్న సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఎల్ 1,2, ఎల్ 3 నిబంధన లేకుండా చూడాలని , తేమశాతంలో సడలింపు ఇవ్వాలని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యం జిల్లా కలెక్టర్ కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పత్తి కొనుగోలు పూర్తిగా సిసిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందున నిబంధనల సడలింపులు తన పరిధిలో లేదని తెలిపారు.

అయితే మూడు, నాలుగు రోజుల్లో ఎల్ 1,ఎల్ 2 తో పాటు, జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లులు ప్రారంభమవుతాయని, అప్పటివరకు సమ్మెకు వెళ్లకుండా పత్తి రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పత్తిని కొనుగోలు చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఆమె సి సి ఐ సీఎం డి తో ఫోన్ ద్వారా మాట్లాడారు. జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలన్నింటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని, సమ్మెకు వెళ్లకుండా పత్తిని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ చేసిన విజ్ఞప్తికి జిన్నింగ్ మిల్లుల యజమానులు అంగీకరించారు.

పత్తి రైతులు సరైన తేమ శాతంతో జిన్నింగ్ మిల్లులకు పత్తిని తీసుకువచ్చేలా వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మిల్లులకు పంపించే విధంగా చూడాలని ఆమె జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ ను ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ రమేష్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, మార్కెటింగ్ ఏడి చాయాదేవి, సిసిఐ అధికారి నింజే, జిన్నింగ్ మిల్లుల అధ్యక్ష కార్యదర్శులు కృష్ణారెడ్డి, శ్రీధర్ రెడ్డి ,జిన్నింగ్ మిల్లుల యజమానులు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

MOST READ :

  1. Tasildar : చింతపల్లి మండల తహసిల్దార్ గా విజయలక్ష్మి.. ఎవరో తెలుసా..! 

  2. District collector : విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఆ కోర్సులను చదివితే భవిష్యత్తు ఉంటుంది..!

  3. District collector : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. శిశు విక్రయాలు, బాల్యవివాహాలు జరిగితే వారిపై చర్యలు..!

  4. Champion : నేషనల్ గేమ్ ఛాంపియన్‌కు ఎంపికైన యువతి.. దాతల కోసం ఎదురుచూపు..!

మరిన్ని వార్తలు