TOP STORIESBreaking News

తెలంగాణలో 10,594 వీఆర్వోల నియామకం.. నోటిఫికేషన్..!

తెలంగాణలో 10,594 వీఆర్వోల నియామకం.. నోటిఫికేషన్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ వ్యవస్థ బలంగా ఉండేందుకు గ్రామస్థాయిలో ఓ అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకుగాను తిరిగి వీఆర్వో వ్యవస్థను తీసుకురానున్నట్లు సమాచారం.

గత ప్రభుత్వ ఆయాంలో విఆర్ఓ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అందుకుగాను త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్నది. గతంలో వీఆర్వో లేదా వీఆర్ఏలుగా పనిచేసిన వారికి కూడా పరీక్ష నిర్వహించి తీసుకోవాలని ఆలోచన ఉన్నది.

అంతేకాకుండా వారి నియామకం తర్వాత కూడా ఖాళీలు ఉంటే నిరుద్యోగులకు అవకాశం కల్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కనీస అర్హత ఇంటర్ లేదా డిగ్రీని నిర్ణయించి వీఆర్వో ఉద్యోగాలను భర్తీ చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10,594 గ్రామ రెవెన్యూ అధికారులను నియమించనున్నారు.

గత ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్వో ల వ్యవస్థను ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరించాలని ఆలోచనలో ఉంది. కొత్తగా ఆర్వోఆర్ చట్టం ను అందరికీ తెలిసే విధంగా ప్రస్తుతం అవగాహన కూడా కల్పిస్తున్నారు.

గతంలో విఆర్ఓ, వీఆర్ఏలుగా పనిచేసిన వారికి ఇంటర్ లేదా డిగ్రీ విద్యార్హతలు ఉన్నవారికి ఒక పరీక్షలు నిర్వహించి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి నియామకం తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి.

18 నుంచి 44 సంవత్సరాల వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి వయసులో సడలింపు కూడా ఉండే అవకాశం ఉంది.

LATEST UPDATE : 

Nalgonda : మూకుమ్మడి సెలవుల్లో వైద్యులు.. వైద్యం అందక మృత శిశువు జననం..!

Cm Revanth : పేదలకు సన్న బియ్యంతో పాటు అవి కూడా పంపిణీ.. తేదీ ఫిక్స్..!

HYDRA : హైడ్రా దూకుడు.. నెక్స్ట్ అనురాగ్..?

Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!

మరిన్ని వార్తలు