Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్తెలంగాణహైదరాబాద్

APS RTC : ఒకే టికెట్ తీసుకొని… రెండు బస్సుల్లో ప్రయాణం ఎలా..?

APS RTC : ఒకే టికెట్ తీసుకొని… రెండు బస్సుల్లో ప్రయాణం ఎలా..?

మన సాక్షి, వెబ్ డెస్క్:

సాధారణంగా బస్సు టికెట్ కొనుక్కుంటే బస్సు నెంబర్ తో సహా టికెట్ పై వస్తుంది. ఆ బస్సు తప్ప వేరే బస్సులో ప్రయాణించే అవకాశం ఉండదు. ఒకే టికెట్టు తీసుకుని ఒకే బస్సులో ప్రయాణం చేయాల్సి ఉంది. కానీ ఓకే బస్ టికెట్ కొనుక్కొని రెండు బస్సుల్లో ఎలా ప్రయాణం చేస్తారు…?

 

కానీ ఏపీఎస్ఆర్టీసీ ఈ సరికొత్త తరహా పథకం ప్రవే ప్రవేశపెట్టనున్నది. ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పనున్నది. ప్రయాణికులకు చేరువయ్యేందుకు కొత్త తరహాలో అడుగులు వేయాలని నిర్ణయించుకున్నది.

 

ఈ తరహా పథకం దేశంలో ఎక్కడా కూడా లేదు. తొలిసారిగా ఈ పథకాన్ని ఏపీఎస్ఆర్టీసీ చేపట్టబోతుంది. ఈ విషయంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రాథమికంగా అమలుపై చర్చించారు. తొలి విడతలో ఎంపిక చేసిన రోడ్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

 

ఓకే టికెట్ రెండు బస్సుల్లో ప్రయాణం :

మల్టీ లెగ్ ట్రావెల్ టికెట్ (ఎంఎల్ టి టి) పేరిట కొత్త ప్రయోగాన్ని ఏపీఎస్ఆర్టీసీ చేయబోతుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నేరుగా బస్సులు లేని పక్షంలో ఒకే టికెట్ పై కనెక్టింగ్ బస్సుల్లో ప్రయాణించేలా అధికారులు ఈ పథకాన్ని రూపొందించారు.

 

విమాన ప్రయాణాలలో నేరుగా ఫ్లైట్ లేనప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది. ఓకే టికెట్ పై కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా గమ్యస్థానానికి చేరుకుంటారు. ఆ విధంగానే ఏపీఎస్ఆర్టీసీ కూడా కొత్త తరహా పథకాన్ని తీసుకురానున్నది.

 

ఈ విధానం హైదరాబాదులోని మెట్రో ప్రయాణంలో కూడా ఉన్నది. గమ్యస్థానానికి చేరడానికి ఒకే మెట్రో టికెట్ తీసుకుంటే కనెక్టింగ్ ట్రైన్ ద్వారా గమ్యస్థానానికి చేసుకోవచ్చు. ఇక ఆర్టీసీ బస్సుల్లో కూడా గమ్యస్థానం చేరుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ కొత్త తరహా విధానాన్ని అమలు చేయబోతుంది.

మరిన్ని వార్తలు