TOP STORIESBreaking Newsఆరోగ్యం

Sleep : పగటి పూట నిద్రపోతున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

Sleep : పగటి పూట నిద్రపోతున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

పగటిపూట నిద్రపోవటం చాలామందికి అలవాటు ఉంటుంది. చదువుకునే విద్యార్థుల నుంచి ఉద్యోగం చేసేవారు సైతం మధ్యాహ్నం భోజనం చేయగానే కాసేపు నిద్రపోవాలని చూస్తారు. కొంతమందికి మాత్రం ఆటోమేటిక్ గా పనిలో ఉన్నప్పటికీ కూడా నిద్ర పట్టేస్తుంది. అయితే అలా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదా..? కాదా..? నిపుణులు ఏమంటున్నారనే విషయం తెలుసుకుందాం..

  • మధ్యాహ్న భోజనం తర్వాత 20 నిమిషాల పాటు నిద్రపోవడం మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది.

  • పగటిపూట కాసేపు నిద్రపోవడం మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది చదువుకునే విద్యార్థులకు మంచి టానిక్ గా ఉపయోగపడుతుంది.

  • పగటిపూట కేవలం 20 నిమిషాల పాటు నిద్రపోవడం మీ విశ్లేషణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దానివల్ల మీరు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.

  • పనిలో ఒత్తిడి ఉన్నట్లయితే కాసేపు నిద్రపోవడం చాలా మంచిది. దానివల్ల స్ట్రెస్ హార్మోన్ల విడుదలను నిద్ర తగ్గిస్తుంది.

  • పగటిపూట నిద్ర రోగనిరోధక శక్తి పెరగడానికి కూడా దోహదపడుతుంది.

  • క్రియేటివిటీ, ఆలోచనా సామర్థ్యం కలిగి ఉండే కుడి మెదడును పగటి నిద్ర ప్రేరేపిస్తుంది.

  • రక్త పోటు నియంత్రణలో ఉంచుతుంది. దానివల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.

  • పగటిపూట కొద్దిసేపు నిద్రపోవడం సర్కార్డియన్ రిథమ్ ను క్రమబద్ధీకరిస్తుంది.

By : MNREDDY, ManaSakshi

MOST READ :

  1. Alumni : దోస్త్ మేరా దోస్త్.. 17 తర్వాత మధుర జ్ఞాపకాలు పంచుకున్న పూర్వ విద్యార్థులు..!

  2. RBI : కరెన్సీ నోట్లపై ఆర్బిఐ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Tahsildar : భూ భారతి గ్రామ సదస్సుల తేదీలు ఇవే.. సద్వినియోగం చేసుకోవాలి..!

  4. Number Plates : నెంబర్ ప్లేట్ మార్చడం తప్పనిసరి.. దగ్గర పడుతున్న మార్చే గడువు..!

  5. Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  6. BIG Alert : వాట్సాప్ ఊహించని షాక్.. ఈ ఫోన్ లలో రేపటి నుంచి పనిచేయదు..!

మరిన్ని వార్తలు