Sleeping on The Foor : నేలపై పడుకుంటున్నారా.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!
Sleeping on The Foor : నేలపై పడుకుంటున్నారా.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!
మన సాక్షి , వెబ్ డెస్క్ :
మన పూర్వీకులకు నేలతో ఎంతో అటాచ్ మెంట్ ఉంది. వారు పట్టు పాన్పులు, మంచాలపై ఎప్పుడు నిద్రించలేదు. వారు మంచంపై ఎప్పుడు పడుకోలేదు. వారు నమ్ముకున్నది కేవలం నేల తల్లిని నమ్ముకున్నారు. అందుకే వారికి ఎక్కువ నేలతో అటాచ్ మెంట్. అందుకే వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించారు. వందేళ్లు బతికారు.
కానీ ప్రస్తుత ఆధునిక కాలంలో మానవులు సుఖంగా ఉండడానికి అలవాటు పడి ఖరీదైన మంచాలు, పట్టు పాన్పులను వేసుకొని పడుకోవడం అలవాటు చేసుకున్నారు. ప్రకృతికి దూరంగా నేల తల్లిని మరచి పట్టుపానుపులపై , పరుపులపై నిద్రిస్తున్నారు. దీనివల్లనే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే నేలపై పడుకోవడం అలవాటు చేసుకోండి. అనేక ప్రయోజనాలు ఉంటాయి.
నేలపై పడుకోవడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. శరీర భంగిమ సరైన రీతిలో వెన్నుముక నిటారుగా ఉంటుంది. ఇది వెన్ను నొప్పిని కూడా తగ్గిస్తుంది. వెన్నుముకపై ఒత్తిడి తగ్గించేందుకు అవసరమైతే పిల్లోనూ వాడుకోవచ్చు. నేలపై పడుకుంటే వీపు నిటారుగా ఉంటుంది. దానివల్ల శరీరం కావలసిన సహజమైన విశ్రాంతి లభిస్తుంది. కండరాలు కూడా రిలాక్స్ అవుతాయి. మనసులోని ఆందోళనలు తొలగిపోతాయి. నేలపై పడుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. నిద్రలో సహజ శరీర కదలికలు ఉంటుంది. రక్తప్రసరణ మంచిగా జరుగుతుంది. నేల వల్ల శరీరానికి చల్లగా ఉంటుంది. శరీర వేడి తగ్గుతుంది. దీనివల్ల మరింత గాడ నిద్రపోవచ్చును.
చాలామంది ఆఫీసు , ఇంటి పనిలో అలసిపోయి ఉంటారు. బాధపడుతుంటారు. అలాంటి పెయింట్స్ కూడా నేలపై పడుకుంటే తొలగిపోతాయి. ఇకపై మీరు కూడా నేలపై పడుకోవడం అలవాటు చేసుకోవడం మంచిది అంటున్నారు వైద్య నిపుణులు.
ALSO READ :
- KTR : కారు దిగుతున్న నేతలు.. వారిపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!
- KTR : యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ హెచ్చరిక.. పరువు నష్టంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం..!
- Corruption of VBKs : సంఘ బంధాలలో విబికెల అవినీతి.. విచారణ జరపాలని సభ్యుల డిమాండ్..!
- Telangabna : పార్లమెంట్ ఎన్నికలకు కెసిఆర్ కుటుంబం దూరం.. 20 ఏళ్లలో ఇదే తొలిసారి..!
- Sand: ఇకపై ఇసుక ఫ్రీ.. వారి అవసరాలకు మాత్రమే..!









