PDS : అక్రమంగా తరలిస్తున్న భారీగా రేషన్ బియ్యం పట్టివేత..!
PDS : అక్రమంగా తరలిస్తున్న భారీగా రేషన్ బియ్యం పట్టివేత..!
టేక్మాల్, మనసాక్షి :
అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని మంగళవారం తెల్లవారుజామున టేక్మాల్ మండల పరిధిలోని బోడ్మట్ పల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి 161 పై పోలీసులు తెల్లవారుజామున 5 గంటలకు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న అందజు 150 క్వింటాలు రేషన్ బియ్యంను పట్టుకున్నారు.
స్థానిక ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా డిప్యూటీ తాసిల్దార్ ప్రణీత రెడ్డి కి తెలిసిన సమాచారం మేరకు జాతీయ రహదారి161 బోడ్మట్ పల్లి గ్రామ శివారులో డిసియం నెంబర్ MH26DB8051 గల డీసీఎం లో సుమారు 150 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకోవడం జరిగింది. హైదరాబాద్ నుండి మహారాష్ట్ర కు తరలిస్తుండగా డీసీఎం ను ఎలాంటి డాక్యుమెంట్లు పరిమిషన్ లేకుండా వాటిని పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పట్టుబడ్డ రేషన్ బియ్యాన్ని పాపన్నపేట మండలంలోని లక్ష్మీ నగర్ శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ లో భద్రపరిచామని తెలిపారు. డీసీఎం యొక్క డ్రైవర్ సయ్యద్ మహమ్మద్ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.
పెద్దవూర మరియు గుడిపల్లి మండలం నుంచి బొలెరో వాహనంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు మండలంలోని పెళ్లి పాకల ఎక్స్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించగా అక్రమంగా తరలిస్తున్న బియ్యమును పట్టుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా సరే సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.
MOST READ :









