BREAKING : నల్గొండలో అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ ఆత్మహత్య..!
BREAKING : నల్గొండలో అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ ఆత్మహత్య..!
నల్లగొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ ఈనెల 22వ తేదీన ఆత్మహత్యయత్నానికి పాల్పడగా 23వ తేదీన మృతి చెందాడు. మృతికి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తుంది.
ఈనెల 22వ తేదీన నల్గొండ పట్టణం, అప్పాజీపేట కి చెందిన అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కేతారపు రాజు (36), షాద్ నగర్ నుండి బదిలీ పై నల్లగొండకు వచ్చారు. నల్గొండ ఫైర్ ఆఫీసులో రిపోర్ట్ చేసి మద్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తన ఇల్లు కథాలగూడ, గ్రీన్ సిటీ కాలనీ లో తన ఇంటికి వెల్లి గడ్డి మందు తాగినాడనీ దీంతో ఆయనను, ఐ కాన్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స జరుపుతుండగా మంగళవారం 23న చనిపోయాడు.
వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అతని తండ్రి కేతారపు కృష్ణయ్య పిర్యాదు లో గత కొంత కాలంగా తన కొడుకుకి, కోడలు కి కుటుంబ పరమైన విషయాలలో గొడవలు జరుగుతున్నాయని, కుటుంబ కలహాల కారణంగా జీవితం పై విరక్తి చెంది గడ్డి మందు తాగి చనిపోయినాడని తెలిపినాడు. అతని తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగినదని ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపినారు.
ఇవి కూడా చదవండి :
- BUDGET 2024: మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం, వ్యవసాయం, గృహ నిర్మాణ రంగాలకు కేటాయింపులు, ఉద్యోగాలకు భారీ ప్రోత్సాహం.. బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు
- సద్దుల చెరువు అలుగు ఆక్రమణ.. అందుకే ఇండ్లలోకి వర్షపు నీరు..!
- Jurala project : జూరాలకు కొనసాగుతున్న భారీ వరద… తెరుచుకున్న 37 గేట్లు..!
- నల్లగొండలో ఎండిన చెరువులు.. ఖమ్మంకు సాగర్ నీళ్లు తరలింపు..!









