Auto : బాబోయ్.. ఆటోలో 18 మంది ప్రయాణం..!

పరిమితికి మించి ప్రయాణిస్తే కఠిన చర్యలు  – డిఎస్పీ వెంకటగిరి

మాడ్గులపల్లి , మనసాక్షి:

పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తే చర్యలు తప్పవని మిర్యాలగూడ డిఎస్పీ వెంకటగిరి అన్నారు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామ శివారులో పరిమితికి మించి (18) మందిని తరలిస్తున్న ట్రాలీ ఆటోను పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు.

 

నల్గొండ మీటింగ్ కు వెళ్లివస్తున్న డిఎస్పీ ఇటీవల వాడపల్లి దగ్గర పొందుగుల లో జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తెలియజేస్తూ కౌన్సిలింగ్ ఇచ్చారు.అదే విధంగా రాంగ్ రూట్లో వస్తున్న మరో రెండు టిప్పర్ డ్రైవర్ ల పై కేసునమోదు చేశారు.