స్మశానవాటికలో యజమాని మృతదేహం వద్ద కన్నీరు పెట్టుకున్న ఆవు దూడ ( వైరల్ వీడియో)

స్మశానవాటికలో యజమాని మృతదేహం వద్ద కన్నీరు పెట్టుకున్న ఆవు దూడ ( వైరల్ వీడియో)

మనసాక్షి , వెబ్ డెస్క్ : యజమాని మరణించడంతో ఆవు దూడ కన్నీరు పెట్టింది. పరుగు పరుగున స్మశాన వాటికకు చేరుకున్న ఆవు దూడ యజమాని ముఖం నాకి కన్నీరు పెట్టుకొని తుది వీడ్కోలు పలికింది. హృదయ విధారక సంఘటన జార్ఖండ్ లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం జార్ఖండ్ లోని హజారిబాగ్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల చనిపోయాడు.

ALSO READ : ఫ్లాష్ .. ఫ్లాష్.. ఉరి వేసుకుని తల్లి కూతుర్లు ఆత్మహత్య

దాంతో బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అంత్యక్రియలకు మృతదేహాన్ని స్మశాన వాటికకు తీసుకెళ్లారు. అంతలో ఒక ఆవు దూడ పరుగున స్మశాన వాటికకు చేరుకుంది. ఆ యజమాని ఆవు దూడను ఎంతో ప్రేమగా చూసుకునేవాడని బంధువులు చెప్పడంతో దానికి మృతదేహం వద్దకు వెళ్లేందుకు దారి ఇచ్చారు. కాగా మృతదేహం వద్దకు చేరుకున్న ఆవు దూడ యజమాని ముఖం నాకి కన్నీరు పెట్టుకొని వీడ్కోలు పలికింది.

ALSO READ : టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు

అంతేకాకుండా అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉంది. అది చూసిన బంధువులు, స్నేహితులు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన ఒక యూజర్ ట్విట్టర్లో పోస్ట్ చేయగా ఈ వీడియో వైరల్ అయింది.

వీడియో చూడండి?