TOP STORIESBreaking Newsఆరోగ్యంజాతీయం

Health Insurance : ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా.. రూ. 10 లక్షలకు పెంపు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..!

Health Insurance : ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా.. రూ. 10 లక్షలకు పెంపు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం మరింత విస్తరించింది. గతంలో ఐదు లక్షల రూపాయల వరకు ఉన్న బీమా కవరేజిని 10 లక్షల రూపాయలకు పెంచింది.

దాంతో పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం లభించనున్నది. 70 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజనుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య సదుపాయం కోసం ఆదుకోవడానికి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో క్యాష్ లెస్, పేపర్ లెస్ ట్రీట్మెంట్ ను పొందవచ్చును. దీని ద్వారా 10 లక్షల రూపాయల ఆరోగ్య భీమా కవరేజీ లభిస్తుంది. ఈ పథకం ద్వారా ముందుగా ఉన్న అన్ని వ్యాధులు మొదటి రోజు నుండే కవర్ అవుతాయి.

దీర్ఘకాలిక వైద్య సమస్యలు ఉన్న కుటుంబాలు ఈ పథకం ద్వారా పూర్తి బీమా కవరేజిని కూడా పొందవచ్చును. దీనికి ఎలాంటి వయోపరిమితి, లింగ పరిమితి కూడా లేదు. 70 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజనులకు ప్రస్తుతం అదనంగా 5 లక్షల బీమా కవరేజి ఉంది. దీనివల్ల కుటుంబం మొత్తం భీమా కవరేజ్ 10 లక్షలకు చేరుకుంటుంది. ఈ పథకానికి ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చును.

MOST READ : 

  1. High court : సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల జీవో 46 పై హైకోర్టులో విచారణ..!

  2. Shabarimale : శబరి వెళ్లే భక్తులకు బిగ్ అప్డేట్.. స్పాట్ బుకింగ్స్ లో మార్పులు..!

  3. Gold Price : మళ్లీ కొండెక్కిన బంగారం.. ఈరోజు తులం ఎంతంటే..!

  4. Phone Calls : ట్రూ కాలర్ అవసరం లేదు.. మీకు వచ్చే కాల్స్ కు ఆధార్ లో ఉండే పేరు డిస్ ప్లే అవుతుంది..!

మరిన్ని వార్తలు