Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయం

Shabarimale : శబరి వెళ్లే భక్తులకు బిగ్ అప్డేట్.. స్పాట్ బుకింగ్స్ లో మార్పులు..!

Shabarimale : శబరి వెళ్లే భక్తులకు బిగ్ అప్డేట్.. స్పాట్ బుకింగ్స్ లో మార్పులు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

కార్తీక మాసంలో శబరిమలైకి వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుంది. కార్తీక మాసం ప్రారంభం నుంచి సంక్రాంతి వరకు దక్షిణాది రాష్ట్రాలలో అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం కు వెళుతుంటారు.

శబరిమలై దేవస్థానం పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా స్పాట్ బుకింగ్ పై పరిమితులు విధించింది. కాగా ప్రస్తుతం వాటిని సడలించే ఆలోచనలో ఉన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని దేవస్థానం పేర్కొన్నద

హైకోర్టు ఆదేశాలు, కేరళ ప్రభుత్వ సూచన మేరకు రోజుకు 75 వేల మంది భక్తుల దర్శనం పరిమితం చేశారు. స్పాట్ బుకింగ్స్ ను కూడా 20 వేల నుంచి ఉండగా వాటిని 5000 వేలకు కుదించారు. తిరిగి వాటిని పెంచే ఆలోచనలో ఉన్నారు. భక్తుల రద్దీ కొంతమేర తగ్గడంతో స్పాట్ బుకింగ్స్ ను పెంచే ఆలోచనలో ఉన్నారు. స్పాట్ బుకింగ్స్ సంఖ్యను 7000 నుంచి 8 వేలకు పెంచే అవకాశాలు ఉన్నాయి.

అదేవిధంగా ఈనెల 16వ తేదీన అయ్యప్ప మండల పూజ సందర్భంగా దేవాలయం తెచ్చుకోవడంతో వారం రోజుల్లోనే 6.50 లక్షలు మంది భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం అయ్యప్ప దేవాలయంలో ప్రతి నిమిషానికి సగటున 85 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది.

MOST READ : 

  1. Bandi Sanjay : పంచాయతీ ఎన్నికల నేపథ్యం.. గ్రామాల అభివృద్ధికి బండి సంజయ్ బంపర్ ఆఫర్..!

  2. Miryalaguda : మహిళా సంఘాలకు రూ.10.10 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్..!

  3. Gold Price : మళ్లీ కొండెక్కిన బంగారం.. ఈరోజు తులం ఎంతంటే..!

  4. TG News : నిత్య పెళ్లికూతురు.. ఘరానా మోసం..!

మరిన్ని వార్తలు