Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణవరంగల్ గ్రామీణ జిల్లావరంగల్ పట్టణ జిల్లా

TG News : నిత్య పెళ్లికూతురు.. ఘరానా మోసం..!

TG News : నిత్య పెళ్లికూతురు.. ఘరానా మోసం..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

వరంగల్ జిల్లాలో నిత్య పెళ్లికూతురు ఘరానా మోసానికి పాల్పడింది ఆమెకు ముందే పెళ్లయిన కూతురు ఉన్నప్పటికీ కూడా మ్యాట్రిమోని ద్వారా మరో పెళ్లి చేసుకుంది. విషయం బయటపడడంతో 8.5 తులాల బంగారంతో పరారైంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నిమిషకవి ఇందిరా(30) అనే మహిళను మ్యారేజ్ బ్యూరో ద్వారా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన మట్టపల్లి దేవేందర్ రావు(31) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రూ.4 లక్షలతో ఘనంగా వివాహ వేడుకలు జరిపించి, మహిళకు 8.5 తులాల బంగారం కానుకగా పెట్టారు.

పెళ్లయిన రెండు రోజులకే మహిళ ప్రవర్తనలో తేడా గమనించి, ఆమె ఫోన్ చెక్ చేశారు. దీంతో ఆమెకు ముందే పెళ్లయిందని, ఒక కూతురు కూడా ఉందని గుర్తించి, మహిళను నిలదీయగా, పెళ్లయిన మాట వాస్తవమే కానీ విడాకులు తీసుకున్నాని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది.

ఈ విషయంలో ఇరువురి మధ్య గొడవ జరగగా, ఉదయం లేచే సరికి బంగారం, నగదుతో పారిపోయింది. మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు, మహిళ, ఆమె తల్లిపై పిర్యాదు చేయగా, గతంలో కూడా ఇద్దరు, ముగ్గురు యువకులను ఇదే తరహాలో మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

MOST READ : 

  1. Accident : ఘోర ప్రమాదం.. రెండు ప్రైవేట్ బస్సులు ఢీ, ఆరుగురు మృతి..!

  2. Gold Price : మళ్లీ కొండెక్కిన బంగారం.. ఈరోజు తులం ఎంతంటే..!

  3. Rythu Bharosa : రైతు భరోసా కు వేళాయే.. రైతుల ఖాతాలలో ఎప్పుడంటే..!

  4. Ministers WhatsApp Group Hack : తెలంగాణ మంత్రుల వాట్సప్ గ్రూప్ హ్యాక్..!

మరిన్ని వార్తలు