Bandi Sanjay : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పులెత్తుకుపోయే దొంగ, ఆయనను ఎవరూ నమ్మడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇది నామాట కాదు రేవంత్ రెడ్డే చెప్పారన్నారు. నాకు బజార్ల అప్పు పుట్టడం లేదు నన్ను ఎవరూ నమ్మడం లేదని అన్నారన్నారు. ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయే దొంగలా చూస్తున్నారని ఆయనే చెప్పారన్నారు. మరి అట్లాంటి చెప్పుల దొంగకు మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు ఓట్లేయాలి? బజార్ల అప్పు కూడా పుట్టని వ్యక్తిని నమ్ముకుని ఏం లాభమన్నారు.

Bandi Sanjay : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్..!
చెప్పుల దొంగకు ఎందుకు ఓట్లేయాలి..?
బజార్ల అప్పు కూడా పుట్టని వ్యక్తిని నమ్ముకుంటే ఏం లాభం?
నిధులు ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఎట్లా అభివ్రుద్ధి చేస్తారు?
బీఆర్ఎస్ పాలనలో దోపిడీలు, కబ్జాలు తప్ప ప్రజలకు చేసిందేమిటి?
పొరపాటున ఆ పార్టీలను గెలిపిస్తే… కేంద్ర నిధులను దారి మళ్లిస్తారు
అభివ్రుద్ధి పూర్తిగా కుంటుపడే ప్రమాదం
కేంద్రం నుండి నిధులు తెచ్చి అభివ్రుద్ధి చేస్తోంది బీజేపీయే
బీజేపీకి మేయర్ పీఠం అప్పగిస్తే…వరదలా నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది
గంగుల, వినోద్ రావు ముఖాలే మోదీకి తెల్వదు… వాళ్లను చూసి నిధులిస్తారా?
కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో సీఎం పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్…
కరీంనగర్, మనసాక్షి :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పులెత్తుకుపోయే దొంగ, ఆయనను ఎవరూ నమ్మడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇది నామాట కాదు రేవంత్ రెడ్డే చెప్పారన్నారు. నాకు బజార్ల అప్పు పుట్టడం లేదు నన్ను ఎవరూ నమ్మడం లేదని అన్నారన్నారు. ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయే దొంగలా చూస్తున్నారని ఆయనే చెప్పారన్నారు.
మరి అట్లాంటి చెప్పుల దొంగకు మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు ఓట్లేయాలి? బజార్ల అప్పు కూడా పుట్టని వ్యక్తిని నమ్ముకుని ఏం లాభమన్నారు. నిధులు ఎక్కడి నుండి తీసుకొచ్చి అభివ్రుద్ధి చేస్తారని ప్రశ్నించారు. ఓట్ల కోసం వచ్చ కాంగ్రెస్ నేతలను 6 గ్యారంటీలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేతలు వస్తే 10 ఏళ్ల పాలనలో ప్రజలను దోచుకుతిన్నారని, ఎందుకు ఓటేయాలంటూ ప్రశ్నించాలని కోరారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం దుర్శేడ్, గోపాల్ పూర్, సప్తగిరి కాలనీ ఉస్మానీ అసోసియేట్స్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 4, 5, 44, 45, 13వ డివిజన్ల బీజేపీ అభ్యర్థులు భూపతి రవీందర్, చిందెం హారిక, బండి తార, గడప విజయలక్ష్మీ, రెడ్డవేణ లావణ్యలను గెలిపించాలని ప్రజలను అభ్యర్ధించారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ ప్రసంగిస్తూ సీఎంతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై ధ్వజమెత్తారు. బీఆర్ఎసోళ్లు 10 ఏళ్లలో చేసిందేమీ లేదని..కబ్జాలు, దోపిడీలు చేసి జైలుకు పోయారన్నారు. ఇప్పుడొచ్చి ఓట్లు అడుగుతుంటే వేద్దామా? మళ్లీ గెలిస్తే నిధులు ఎక్కడి నుండి తీసుకొస్తారన్నారు.కేంద్రం నిధులిచ్చినా దారి మళ్లించి దోచుకోకుండా ఉంటారానేది ప్రజలు ఆలోచించాలన్నారు.
బండి సంజయ్ ఏం తీసుకొచ్చారని మేమే కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చామని మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతున్నారన్నారు. మోదీకి కమలాకర్, వినోద్ కుమార్ ముఖం తెలుసా? అని బండి అడిగారు. వాళ్లను గుర్తు పడతారా?… వాళ్లు అడిగితే మోదీ ఎందుకు పైసలు ఇస్తారన్నారు.
కరీంనగర్ లో జరిగిన అభివ్రుద్ధి అంతా కేంద్ర నిధులతోనే కరీంనగర్ కు రూ.1500 కోట్ల నిధులు మోదీ ఇచ్చారన్నారు. ఈ మధ్య ఢిల్లీ పోయినప్పుడు మోదీ తనతో చెప్పారన్నారు. బండి… మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపించమను మరిన్ని నిధులు ఇచ్చి అభివ్రుద్ధి చేస్తా అని అన్నారన్నారు. కరీంనగర్ కు మేయర్ పీఠంవ అప్పగిస్తే వరదలా నిధులను తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. పొరపాటున కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపిస్తే ఇంటి పన్నులు, నల్లా ఛార్జీలు, కరెంట్ ఛార్జీల పెంచుడు కాయమన్నారు.
అదే బీజేపీకి ఓట్లేస్తే మున్సిపాలిటీల్లో ఏ ఒక్క పన్ను పెంచకుండా కేంద్రం నుండే నిధులు తీసుకొచ్చి కరీంనగర్ కు మరింత అభివ్రుద్ధి చేస్తానన్నారు. మొన్ననే కేంద్రం కరీంనగర్ కార్పొరేషన్ కు రూ.50 కోట్లు ఇచ్చిందన్నారు. ఇంటింటికీ నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్రం నుండి రూ.134 కోట్లు తీసుకొచ్చినట్లు తెలిపారు.
ఆ డబ్బులతో కరీంనగర్ ను మరింత అభివ్రుద్ధి చేస్తానన్నారు. నిరంతరాయంగా ఇంటింటికీ నీళ్లు ఇస్తామన్నారు. పొరపాటున కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లేస్తే ఆ నిధులను దారి మళ్లిస్తారన్నారని, దింతో అభివ్రుద్ధి కుంటుపడుతుందన్నారు. ప్రజలు ఆలోచించించి బీజేపీని ఆశీర్వదించాలని కోరారు.
By : Naresh, Karimnagar
MOST READ
-
Miryalaguda : ఫర్టిలైజర్ యూరియా యాప్ పై మిర్యాలగూడలో రైతులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి..!
-
Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ రూ.50వేలు తగ్గిన బంగారం ధర..!
-
CM Revanth Reddy : బీఆర్ఎస్, బిజెపిలకు డిపాజిట్లు రావద్దు..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు లైన్ క్లియర్.. సీఎం రేవంత్ రెడ్డి తాజా ప్రకటన..!










