మిర్యాలగూడ : పొట్ట దశలో ఉన్న పంటలను నీటి విడుదల చేసి కాపాడాలి..!

నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో పొట్ట దశలో ఉన్న వరి పంటలను నిరంతరంగా నీటిని విడుదల చేసి కాపాడాలని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ కోరారు.

పొట్ట దశలో ఉన్న పంటలను నీటి విడుదల చేసి కాపాడాలి..!
మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్

మిర్యాలగూడ ,మన సాక్షి :

నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో పొట్ట దశలో ఉన్న వరి పంటలను నిరంతరంగా నీటిని విడుదల చేసి కాపాడాలని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ కోరారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వానాకాలం సీజన్ లో వర్షాలు లేకపోవడంతో సాగర్ డ్యాం నిండనందున సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేయలేకపోవడం జరిగిందన్నారు.

కానీ రైతులు వర్షాలు వచ్చి సాగర్ నిండకపోదా.. అని రైతులు బోర్లు బావుల కింద నాట్లు వేయడం జరిగిందన్నారు. తీవ్ర వర్షాబావ పరిస్థితుల వల్ల రైతులు వేసిన నాట్లు వేసిన వరి పొలాలు చిరు పొట్ట దశకు వచ్చినాయని, చిరు పొట్ట దశకు వచ్చే టైంలో వరికి అధికంగా నీటి అవసరం ఉంటుందని పేర్కొన్నారు.

కాబట్టి రైతులు వేసిన పొలాలు ప్రస్తుతం 70% ఎండిపోయే పరిస్థితి ఏర్పడ్డదని. దానిని కేసీఆర్ ఒక రైతు పక్షపాతిగా చిరు పొట్ట దశలో ఎండి పోతే రైతు నష్టపోతాడని డ్యాం డెడ్ స్టోరేజీలో ఉన్న ఒక పది రోజులు నీటి విడుదల చేయించాన్నారు .

మరో పది రోజులు ఆగి మరో పది రోజులు నీటి విడుదల చేయిస్తామని చెప్పడం జరిగిందని, వరి పొలాలు చిరు పొట్ట దశలో ఉన్నవి కాబట్టి ఈ పది రోజులు నీరు విడుదల చేయడం వల్ల మేజర్ చివరి నాట్లు వేసిన వారికి నీరు అందడం ఇబ్బందిగా ఉంటుందన్నారు.

ALSO READ : Nalgonda Brs : నల్లగొండ బీఆర్ఎస్ లో ముసలం.. పిల్లి రామరాజు యాదవ్ సస్పెన్షన్..!

కాబట్టి మధ్యలో పది రోజులు గ్యాప్ ఇచ్చే బదులు నిరంతరంగా 20 రోజులు నీటి విడుదల చేస్తే వరి పొలాలు చిరు పొట్ట దశ నుంచి బయటపడతాయన్నారు. కాబట్టి కెసిఆర్ దయతో నిరంతరంగా 20 రోజులు నీరు విడుదల చేయగలరని కోరుచున్నామన్నారు.

సమావేశం లో డిసిసిబి డైరెక్టర్ బంటు శ్రీనివాస్ , బిఆర్ఎస్ నాయకులు సైదిరెడ్డి, గోవిందరెడ్డి, మన్నెం లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Online History : మీ ఆన్ లైన్ చరిత్ర అంతా అక్కడుంది.. మీరు ఓపెన్ చేసే సైట్లు, పాస్ వర్డ్స్ అన్ని అక్కడ స్టోర్ అవుతాయి.. తెలుసుకోండి ఇలా..!