మిర్యాలగూడ : బీసీ నాయకుల ముందస్తు అరెస్ట్..1

ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మిర్యాలగూడ విచ్చేయుచున్న సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు.

మిర్యాలగూడ : బీసీ నాయకుల ముందస్తు అరెస్ట్..!

మిర్యాలగూడ, మన సాక్షి:

ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మిర్యాలగూడ విచ్చేయుచున్న సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం నాయకులు తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు ప్రాణ త్యాగాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉద్యమ నాయకులను అరెస్టు చేసి సమావేశాలు నిర్వహించుకునే పరిస్థితి ఏర్పడ్డదన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బీసీల అణచివేత ధోరణి అవలంబిస్తూ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటుందన్నారు. బీసీలకు బీసీ బంధు పథకం కింద ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బీసీలను తీవ్రంగా అవమానించిందని ఆయన అన్నారు.

ALSO READ : BIG BREAKING : టిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగింత..!

అలాగే బీసీ విద్యార్థుల ఫీజు పెండింగ్ బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు చదువులు మానేసి కులి పనులకు వెళ్లవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. మిర్యాలగూడ ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎంతోకాలంగా ఉద్యమిస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.

ఈ సమస్యలపై ముఖ్యమంత్రికి వినతి పత్రం అందించాలి అనుకున్న బీసీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో బంధించడం జరిగిందన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో పోలగాని వెంకటేష్ గౌడ్, ఆర్లపూడి శ్రీనివాస్, చిలకల మురళి, రాయించు నరసింహ, ఎర్రబెల్లి గంగాధర్, నరేష్, కుకడపు సురేష్ ఉన్నారు.

ALSO EAD : చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్.. సాయంత్రం జైలు నుంచి విడుదల..!