చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్.. సాయంత్రం జైలు నుంచి విడుదల..!

స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో జైలుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పు విలువరించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ న్యాయస్థానం మంజూరు చేసింది. ఈ బెయిల్ నాలుగు వారాలపాటు ఇచ్చింది. దాంతో మంగళవారం సాయంత్రం ఆయన జైలు నుంచి బయటికి రానున్నారు.

చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్.. సాయంత్రం జైలు నుంచి విడుదల..!

అమరావతి , మన సాక్షి :

స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో జైలుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పు విలువరించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ న్యాయస్థానం మంజూరు చేసింది. ఈ బెయిల్ నాలుగు వారాలపాటు ఇచ్చింది. దాంతో మంగళవారం సాయంత్రం ఆయన జైలు నుంచి బయటికి రానున్నారు.

కంటి శాస్త్ర చికిత్స అవసరం అనే వాదనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. దాంతో ఆయనకు హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబు ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ వేసుకున్న పిటిషన్ పై విచారణ పూర్తయిన సంగతి తెలిసిందే. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత బెయిల్ మంజూరు చేసింది.

స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా 53 రోజుల నుంచి ఉన్నారు. ఆయన కుడి కంటికి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు పేర్కొన్నారు. దాంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. కాగా నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు విలువరించింది.

ALSO READ : KCR : గన్ మెన్ కు దండం పెట్టి కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్.. ఎందుకో తెలుసా..!