Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణసిద్దిపేట జిల్లాహైదరాబాద్

KCR : గన్ మెన్ కు దండం పెట్టి కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్.. ఎందుకో తెలుసా..!

KCR : గన్ మెన్ కు దండం పెట్టి కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్.. ఎందుకో తెలుసా..!

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గన్ మెన్ కు దండం పెట్టి కృతజ్ఞతలు తెలిపారు . ఎందుకో తెలుసుకోవాలని ఉందా..

రాజకీయ నాయకుల ప్రాణాలు వారికి అంగరక్షకులుగా ఉన్న గన్ మెన్ ల చేతిలోనే ఉంటాయి. వారు అప్రమత్తంగా లేకుంటే ఎంతటి రాజకీయ నాయకుడైన ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. అలాంటిది దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో అగంతకుడు దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి జరిగిన సమయంలో అప్రమత్తంగా ఉన్న గన్ మెన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ దండం పెట్టి కృతజ్ఞతలు తెలిపారు.

ALSO READ : BIG BREAKING : కత్తితో దాడి ఘటన లో ఎంపీ ప్రభాకర్ రెడ్డికి సీరియస్.. యశోద ఆసుపత్రికి తరలింపు..!

హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఆ సమయంలో గన్మెన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ముగిసిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సర్జరీ :

మెదక్ ఎంపీ ,దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి యశోద ఆసుపత్రిలో చికిత్స ముగిసింది.
చిన్న ప్రేగుకు 4 చోట్ల గాయాలు. 15 సెంటిమిటర్లపై కడుపును కట్ 10 సెంటిమిటర్లు చిన్న ప్రేగును తొలగించిన యశోద వైద్యులు.

గ్రీన్ ఛానెల్‌తో హైదరాబాద్‌కు తరిలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేది. రక్తం అంత కూడా కడుపులో పేరుకుపోయింది. అందుకే 15 సెంటిమిటర్లు కట్ చేసి పేరుకుపోయిన రక్తం అంత క్లీన్ చేశాము. లోపల రక్తం పెరుకుపోవడం, ప్రేగుకు 4 చోట్ల గాయాలు కావడంతో సర్జరీ ఇంత ఆలస్యం అయిందని యశోద ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.

ALSO READ : BIG BREAKING : టిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగింత..!

మరిన్ని వార్తలు