Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసిద్దిపేట జిల్లా

BIG BREAKING : కత్తితో దాడి ఘటన లో ఎంపీ ప్రభాకర్ రెడ్డికి సీరియస్.. యశోద ఆసుపత్రికి తరలింపు..!

BIG BREAKING : కత్తితో దాడి ఘటన లో ఎంపీ ప్రభాకర్ రెడ్డికి సీరియస్.. యశోద ఆసుపత్రికి తరలింపు..!

దుబ్బాక , మన సాక్షి :

బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. కత్తి దాడికి గురైన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని మొదట గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి సీరియస్ గా ఉండటంతో హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఆయనకు యశోద ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన స్పృహలో లేరు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి లో ఓ కుటుంబాన్ని పరామర్శించి వస్తుండగా దుండగుడు కత్తితో దాడి చేశాడు.

షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తి ప్రభాకర్ రెడ్డి పొట్టలో కత్తితో దాడి చేశారు. దాంతో ప్రభాకర్ రెడ్డిని హుటాహుటిన గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కత్తితో దాడి చేసే సమయంలో కార్యకర్తలు అలర్ట్ గా ఉండి దాడి చేసిన వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితక బాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. దాడి చేసిన వ్యక్తి చెప్యాలకు చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు.

ALSO READ : BIG BREAKING : టిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగింత..!

అతడు యూట్యూబ్ ఛానల్ లో విలేకరిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది. వెంటనే మంత్రి హరీష్ రావు ప్రభాకర్ రెడ్డిని ఫోన్ లో పరామర్శించారు. అవసరమైతే హైదరాబాద్ కు తరలించాలని సూచించారు.

కాగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి ఎందుకు జరిగింది..? ఓ పథకం ప్రకారం జరిగిందా..? అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి పై దాడిని పలువురు తీవ్రంగా ఖండించారు.

ALSO READ : Congress Party : ఆ 19 స్థానాలే కీలకం.. రేవంత్ రెడ్డికి పరీక్ష.. పోటాపోటీగా అభ్యర్థులు..!

మరిన్ని వార్తలు