Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda : బిసి సంక్షేమ సంఘం.. కలెక్టరేట్ ముట్టడి..!

Nalgonda : బిసి సంక్షేమ సంఘం.. కలెక్టరేట్ ముట్టడి..!

నల్లగొండ, మన సాక్షి.

తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించారు. చట్ట సభలలో విద్యా ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలలో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, దుడుకు లక్ష్మీనారాయణ,జేఏసీ చైర్మన్ మునస ప్రసన్నలు, మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి బిసి డిక్లరేషన్ సభలో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం గడిచిన 42 శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్ల గురించి మాట్లాడకపోవడం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఇతర సంఘాలు మేధావులు ప్రతిపక్ష నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సందర్భంలో అసెంబ్లీలో ఏక తీర్మానం చేసి గవర్నర్కు రాష్ట్రపతికి ప్రధానమంత్రి కి పంపించడం జరిగిందాని తెలిపారు.

కొంతమంది బీసీ సంఘాలను తీసుకొని పెద్ద ఎత్తున హడావుడి చేసి ప్రధానమంత్రిని హైదరాబాదుకు రప్పిస్తానన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి 56 సార్లు ఢిల్లీకి పోయి ఒక్కసారి కూడా ప్రధానితో చర్చించకపోవడం కేంద్రం రాష్ట్రాలకు ఆర్టికల్ ప్రకారం స్వయప్రత్పతి 42 శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఇవ్వడానికి పూర్తి అధికారం ఉన్నది కానీ విద్య, ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలంటే కేంద్రం పార్లమెంట్లో బిల్లు పెట్టి 9వ షెడ్యూల్లో చేరిస్తే తప్ప దానికి చట్టబద్రత రాదు అన్నారు.

3500 కోట్ల రూపాయలు సాకు చూసి అభివృద్ధి కుంటుబోతుందని చెప్పి స్థానిక సంస్థ రిజర్వేషన్ల కోసం తర్వాత జెడ్పిటిసి ఎంపిటిసి లకు ఎన్నికలకు నిర్వహిస్తామని చెప్పడం ఇది చాలా దారుణం ఇప్పటికైనా స్థానిక సంస్థల రిజర్వేషన్లు చట్టబద్రత కల్పించేంతవరకు ఎన్నికలకు పోకూడదని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ధర్నా అనంతరం ఏవో గారికి విన్నతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమం లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం లక్ష్మీనారాయణ, జిల్లా కోశాధికారి జేరిపోతుల రమేష్ గౌడ్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయిత గో నీ జనార్దన్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కట్ట హరిబాబు, బక్కతట్ల వెంకన్న యాదవ్, కట్టబోలు దీపేందర్, మచ్చ నాగరాజు యాదవ్, తిరుపతయ్య గౌడ్,

పుట్ట వెంకన్న గౌడ్, కర్నాటి యాదగిరి, గజ్జి అజయ్, గడ్డం శంకరయ్య, భరద్వాజ్, మల్లబోయిన సతీష్ యాదవ్, చిలుకరా సతీష్,చిలక రాజు చెన్నయ్య, వడ్డే పోయిన రామకృష్ణ, అంబటి శివ, అనంత నాగరాజు, రమణ, ముదిరాజ్, వి కృష్ణ, భాస్కర్, సతీష్, యాదవ్,తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. KTR : కేటీఆర్ సంచలన ఆరోపణ.. తెలంగాణలో భూ కుంభకోణం..!

  2. Miryalaguda : డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. నకిలీ బంగారం విక్రయిస్తున్న లీడర్ అరెస్ట్..!

  3. Khammam : ఖమ్మంలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త.. కూతురుపై కూడా..!

  4. ACB : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ కి చిక్కిన ఎస్సై రాజేష్..!

మరిన్ని వార్తలు