Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. నకిలీ బంగారం విక్రయిస్తున్న లీడర్ అరెస్ట్..!

Miryalaguda : డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. నకిలీ బంగారం విక్రయిస్తున్న లీడర్ అరెస్ట్..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నకిలీ బంగారంతో ప్రజలను మోసం చేస్తున్న కర్ణాటకకు చెందిన గోవిందప్ప ను పోలీసులు అరెస్టు చేసినట్టు మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్రాజు తెలిపారు. గురువారం సాయంత్రం స్ధానిక పోలీసు సబ్ డివిజన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో తన పర్యవేక్షణలో సిసిఎస్ ఇన్స్పెక్టర్. ఎం.జితేంద్రరెడ్డి, చంద్రశేకర్ రెడ్డి సిసిఎస్ సిబ్బందిలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను గాలించారన్నారు. ప్రధాన నిందితుడు గోవిందప్పను నల్లగొండ సీసీఎస్, మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిపారు. కర్ణాటక స్టేట్ బళ్ళారి జిల్లా కోరచర హల్లి, హురులికలు, కుడ్లిగిలకు చెందిన గోవిందప్ప ను అరెస్ట్ చేయగా మహేష్, లోహిత్, నాగప్ప,
ప్రసన్నగంగప్ప పరారీలో ఉన్నట్లు తెలిపారు.

సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో వివిధ ప్రాంతాలకు తిరుగుతూ అమాయక ప్రజలను గుర్తించి వారి వివరాలను ముందుగా తెలుసుకొని, వారికి పరిచయస్తుడుగా మాట్లాడి వారికి ఏదో ఒక పేరు చెప్పి, ప్రస్తుతం బంగారం ధర ఎక్కువ ఉండటంతో తక్కువ ధరకే ఇస్తానని నమ్మించి మోసం చేసి సులభంగా డబ్బులు సంపాదిస్తున్నారు.

అదే విధంగా మిర్యాలగూడ పట్టణంలో పరిసర ప్రాంతాలలో జగిత్యాల జిల్లాలోని కోరుట్ల టౌన్ కు చెందిన కారపు శ్యామ్ సుందర్ అను వ్యక్తిని మోసం చేసి, తీవ్ర భయభ్రాంతులకు గురిచేసి బెదిరించి, బలవంత పెట్టి శ్యామ్ సుందర్ నుండి 12 లక్షల రూపాయలు గుంజుకొని టాటా టియాగో కారు లో వెళ్ళిపోయినారు.

జరిగిన విషయంపై ఫిర్యాదుదారుడు కంప్లయింట్ చేయగా మిర్యాలగూడ టూ టౌన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. గురువారం ఉదయం 6 గంటల సమయంలో మిర్యాలగూడ పట్టణంలోని అద్దంకి-నార్కెట్పల్లి స్టేట్ హై వే బైపాస్ రోడ్డు శ్రీ కృష్ణపట్నం హోటల్ అవతల రోడ్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన కర్నాటక రిజిస్ట్రేషన్ నంబరున్న గ్రే కలర్ టాటా టియాగో కారును ఆపి విచారించగా ఇతడిని నకిలీ బంగారంతో అమాయక ప్రజలను మోసగిస్తున్న గోవిందప్ప గా గుర్తించి అతనిని పట్టుకొని అరెస్ట్ చేశారు. స్థానిక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచినట్టు తెలిపారు.

కేసును చేదించిన మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో సి‌సి‌ఎస్ ఇన్స్పెక్టర్ ఎం.జితేందర్ రెడ్డి, చంద్రశేకర్ రెడ్డి, మిర్యాలగూడ ఇన్స్పెక్టర్ జె.సోమనర్సయ్య టు టౌన్, ఎస్ఐలు బి.రాంబాబు, సి‌సి‌ఎస్ ఎస్‌ఐ విజయ్ కుమార్, సి‌సి‌ఎస్ హెడ్ కానిస్టేబుల్ గిరి, పుష్పగిరి, కానిస్టేబుల్ వెంకట్, మహేష్, సాయి, ఏండీ.అక్బర్, ఎం. రామకృష్ణ, జి.లక్ష్మయ్య, ఎన్. రాజశేఖర్ రాజులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పవర్ ప్రత్యేకంగా అభినందించారు.

ఎవరైనా ఈ విధంగా మోస పోయినట్లు అయితే దైర్యంగా ఫిర్యాదు చేయవచ్చునని, ఫోన్ నెంబర్: 8712670162, 8712670163_ నల్గొండ జిల్లా క్రైమ్ పోలీసుస్టేషన్ తెలపాలన్నారు.

MOST READ : 

  1. Union Minister : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన.. 80 కోట్ల మంది పేద ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ..!

  2. Khammam : ఖమ్మంలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త.. కూతురుపై కూడా..!

  3. TG News : కేటీఆర్ కు బిగ్ షాక్.. ఫార్ములా ఈ కేసులో విచారణకు గవర్నర్ అనుమతి..!

  4. TG News : కారుకు సైడ్ ఇవ్వలేదని తండ్రి వయసున్న ఆర్టీసీ డ్రైవర్ పై కాలితో తన్ని దాడి.. (వీడియో వైరల్)

మరిన్ని వార్తలు