జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనల్గొండ

Miryalaguda : ఆరోగ్యము పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.. అవగాహన కల్పించిన జన విజ్ఞాన వేదిక..!

Miryalaguda : ఆరోగ్యము పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.. అవగాహన కల్పించిన జన విజ్ఞాన వేదిక..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మనిషి మనుగడకు ఆహారపు అలవాట్లు ప్రధాన కారణమని, ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఆయుః ప్రమాణాన్ని పెంచుకొనే అవకాశం ఉందని జన విజ్ఞాన సీనియర్ నాయకులు పాదురి రమణారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం సోమవారం చిల్లపురం, ఐలాపురం, పెద్ద దేవుల పల్లి గ్రామాలలో ఉపాధి హామీ పనులు చేసే వారి వద్దకు వెళ్లి ఆరోగ్య విషయాలు చెబుతూ, ఉపాధి హామీ పనుల నాణ్యత పెంచాలని, వేసవి దృష్టిలో ఉంచుకొని వీలయినంత వరకు ఉదయం తొందరగా వెళ్లి పనులు చేసుకొని ఎండ సమయానికి ముగించుకోవాలని సూచించారు.

అదే విధంగా పక్షవాతము, మూర్చలు, బీపీ, షుగర్ వ్యాధి ఉన్న నిరుపేదలకు మిర్యాలగూడ హొసింగ్ బోర్డు లోని నవ జ్యోతి ఇంగ్లిష్ మీడియం స్కూల్ నందు ప్రముఖ నరాల వైద్యులు గోపాలం శివన్నారాయణచే పరీక్షించి, రోగినుండి నెలకు 75 రూపాయలు, నాలుగు నెలలకు కలిపి 300 రూపాయలు నామమాత్రంగా తీసుకొని దాతల సహకారం తో 4 నెలలకు వారికి అవసరమయ్యే మందులు అందజేస్తున్నామని, ఇట్టి అవకాశాన్ని ఉపయోగించు కోవాలని విజ్ఞప్తి చేశారు.

జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు గుత్తికొండ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ వంట నూనెల వాడకం ప్రతీ నెల బాగా పెరుగుతుందని, మార్కెట్ లో దొరికే నూనెలకన్నా, వేరు శనగలు నువ్వులు, కుసుమలు, కొబ్బరి వంటి వాటిని గానుగలలో ఆడించి తీసిన నూనెలు వాడాలని, వంటకు అల్యూమినియం పాత్రలు వాడినట్లయితే అవి కరిగి మనం తినే ఆహారం లోకి వెళ్లి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉన్నందున స్టీలు, ఇనుప పాత్రలు వంటకు ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.

సీనియర్ జే వి వి నాయకులు, ఉపాధ్యాయ సంఘము జిల్లా అధ్యక్షులు బక్కా శ్రీనివాస చారి మాట్లాడుతూ కృత్రిమ శీతల పానీయలు అయిన కూల్ డ్రింక్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి, తియ్య ధనం కోసం దానిలో రసాయన పాదర్ధాలు వాడుతున్నారని వాటిని తాగడం వలన అల్సర్ లు, కాలేయ సంభతిత రోగాలు వచ్చే అవకాశం ఉందని వాటిని త్రాగడం మానివేసి సహజ పానియాలు అయిన పళ్ళ రసాలు, మజ్జిగ, షర్భత్ వంటి వాటిని సేవించాలని, విద్యార్థులను నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, ప్రభుత్వ ఆస్పత్రులలో రక్త పరీక్షలు చేయించుకొని తమ ఆదాయాన్ని ఆదా చేసుకోవాలని కోరారు.

మరో సీనియర్ జే వి వి నాయకులు మోర్తల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంచే గుర్తించ బడిన జెనరిక్ మందులను వాడాలని, వాణిజ్య ప్రకటన లు చూసి మోసపోవద్దని, వేసవి కాలం దృష్ట్యా సాధ్యమైనంత వరకు ఎండ రాకముందే ఆరుబయట పనులు ముగించుకొని, వీలయినంత వరకు ఎక్కువ నీటిని తీసుకొని వడ దెబ్బ ప్రమాదానికి గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ పధకం సేవకులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Mental Health : మానసిక ఆరోగ్యం కోసం ఇలా చేయండి..!

  2. Shaligowraram : పూర్వ విద్యార్థుల 20 ఏళ్ల ఆత్మీయ కలయిక..!

  3. Gold Price : తగ్గినట్టే తగ్గి.. మళ్లీ యధావిధిగా గోల్డ్ రేట్..!

  4. Watermelon : తొక్కే కదా అని తీసి పడేస్తున్నారా.. ఇది తెలిస్తే అస్సలూ వదలరు..!

  5. Suryapet : సూర్యాపేట జిల్లాలో విషాదం.. బావిలో ఈతకు వెళ్లిన ఇద్దరు మృతి..!

మరిన్ని వార్తలు