సూర్యాపేట : ఎలుగుబంటి కలకలం  (వీడియో వైరల్)

సూర్యాపేట : ఎలుగుబంటి కలకలం  (వీడియో వైరల్)

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎలుగుబంటి ఆదివారం హల్చల్ చేసింది..దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట లోనిఒక ఇంట్లోకి ప్రవేశించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

పట్టణంలో డిమార్ట్ వెనకాల నిర్మాణంలో ఉన్న భవనంలోకి గత రాత్రి ప్రవేశించిదని స్థానిక ప్రజలు వాపోతున్నారు.. ముందుగా అక్కడ స్థానికంగా నివాసం ఉంటున్న తండు శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లోకి ఎలుగు బంటి రంగప్రవేశం చేసింది… ఇంట్లో ఉన్న వారు చూసి భయాందోళనకు గురై కేకలు వేయడంతో వెంటనే ఆ ప్రాంతం నుండి పక్కనే ఉన్న గుండగాని రాములు ఇంట్లోకి ఎలుగుబంటి ప్రవేశించింది.

 

అక్కడ ప్రజలు పోలీసులకు,అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.సంఘటన స్థానానికి పోలీసులు అటవీశాఖ అధికారులు చేరుకున్నారు.. ఎలుగుబంటిని పట్టుకున్నే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు.