5వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం 

5వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం 

కొమురం భీమ్ ఆసిఫాబాద్, మన సాక్షి.

కాగజ్ నగర్ మండలం మోసం గ్రామ శివారులో గుడుంబా తయారీ చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు ఈస్గాం ఎస్సై జగదీష్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. మోసం గ్రామ శివారులో గుబురు పొదలలో అక్రమంగా గుడుంబా తయారీకి సిద్ధంగా ఉన్న 5వేల లీటర్ల బెల్లం పానకం, సామాగ్రి లభ్యం అయ్యిందని పేర్కొన్నారు.

 

బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్టు ఎస్సై తెలిపారు. ఈ సోదాలలో ఏఎస్ఐ హీరామన్, హెడ్ కానిస్టేబుల్ శంకర్, కానిస్టేబుల్ నయీమ్, హోమ్ గార్డ్ లింగన్న పాల్గొన్నారు.