Narayanpet : భగవద్గీత కంఠస్థంలో ఘనాపాటి.. రాష్ట్ర స్థాయికి ఎంపికైన చిన్నారి మోక్షిత..!

Narayanpet : భగవద్గీత కంఠస్థంలో ఘనాపాటి.. రాష్ట్ర స్థాయికి ఎంపికైన చిన్నారి మోక్షిత..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
చిన్ననాటి నుంచి భగవద్గీత పఠనం చేస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిధుమందిర్ పాఠశాల చిన్నారి విద్యార్థి భగవద్గీత కంఠస్థం లో ఘనాపాటి గా నిలిచింది. నారాయణపేట జిల్లా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి భగవద్గీత కంఠస్థ పోటీలు ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి విద్యార్థుల వరకు నిర్వహించారు.
ఒకటవ తరగతి వరకు నిర్వహించిన పోటీలో అశోక్ నగర్ శిశుమందిర్ పాఠశాలకు చెందిన మోక్షిత మరాఠీ జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి భగవద్గీత కంఠస్థ పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులు మరాఠీ వెంకట రాములు స్వప్న రాణి మాట్లాడుతూ పిల్లలకు సంస్కృతి సంప్రదాయ పద్ధతులను నేర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులపై ఉందన్నారు.
తమ బిడ్డకు చిన్నప్పటి నుంచే హనుమాన్ చాలీసా, భగవద్గీత శ్లోకాలను నేర్పిస్తు న్నామన్నారు. ఇలాంటివి నేర్పించడం వల్ల విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరు లుగా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయని తెలిపారు. నిర్వాహకులు మాట్లాడుతు ప్రతి తల్లిదండ్రులు వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిల్లలను తీర్చిదిద్దాలని కోరారు.
MOST READ :
-
District collector : పంచాయతీ ఎన్నికలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. పారదర్శకంగా నిర్వహించాలి..!
-
TG News : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే..!
-
Phone Calls : ట్రూ కాలర్ అవసరం లేదు.. మీకు వచ్చే కాల్స్ కు ఆధార్ లో ఉండే పేరు డిస్ ప్లే అవుతుంది..!
-
TG News : నిత్య పెళ్లికూతురు.. ఘరానా మోసం..!









