Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పై సంచలన కామెంట్స్..!

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పై సంచలన కామెంట్స్..!

మిర్యాలగూడ , మన సాక్షి :

మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ సోమవారం సంచలన కామెంట్స్ చేశారు. ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆయన చేరిక చెల్లదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన విడుదల చేసిన విషయం కూడా తెలిసిందే.

భార్గవ్ చేరికను స్థానిక ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి తో పాటు డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ కూడా వ్యతిరేకించారు. కాగా ఆయన సోమవారం స్థానిక వాసవిభవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సంచలన కామెంట్స్ చేశారు.

ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన కుటుంబాల వారే, ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో జానారెడ్డి కుటుంబంతో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నందున తామంతా ఆయన గెలుపుకు కృషి చేయాలని , మిర్యాలగూడ పట్టణంలో భారీ మెజారిటీ తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు.

తాను కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయంపై మాట్లాడుతూ పార్టీలో చేరికను నిలిపివేయడం అధిష్టానం నిర్ణయమని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా.. తాము కట్టుబడి ఉంటామని సంచలన ప్రకటన చేశారు. అదేవిధంగా స్థానిక నాయకులతో కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో రఘువీర్ రెడ్డికి మిర్యాలగూడ పట్టణంలో అత్యధిక మెజార్టీ తీసుకురావడమే లక్ష్యంగా ఆయన తెలిపారు.

ఆయనతోపాటు మాజీ మున్సిపల్ చైర్మన్ మెరుగు రోశయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉబ్బపల్లి సోములు, పి ఎస్ ఎస్ చైర్మన్ బంటు శ్రీనివాస్, నాయకులు ఖాదర్, గోవిందరెడ్డి, సైదిరెడ్డి, అమృతం సత్యం, చీదెల శ్రీనివాస్, రమేష్, పత్తిపాటి నవాబ్, సలీం, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Miryalaguda : మున్సిపల్ చైర్మన్ భార్గవ్ కాంగ్రెస్ లో చేరికకు బ్రేక్..!

Miryalaguda : బిఆర్ఎస్ కు బిగ్ షాక్… కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మున్సిపల్ చైర్మన్ బార్గవ్..!

Komatireddy : కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది..!

BREAKING : కాంగ్రెస్ సర్కార్ పై బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్..!

మరిన్ని వార్తలు