BREAKING : సీఎం రేవంత్ రెడ్డికి భారీ షాక్.. సొంత జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం..!
BREAKING : సీఎం రేవంత్ రెడ్డికి భారీ షాక్.. సొంత జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం..!
మహబూబ్ నగర్, మన సాక్షి :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బిగ్ షాక్ తగిలింది. ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి పై నవీన్ రెడ్డి 111 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఎన్నికల ముందు కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తం 1437 కోట్లు పోలయ్యాయి. కాగా వాటిలో టిఆర్ఎస్ కు 763, కాంగ్రెస్ కు 652, ఇండిపెండెంట్ అభ్యర్థికి ఒక ఓటు వచ్చింది.
బీఆర్ఎస్ కు ఊరట :
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ కు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు కాస్త ఊరటనిచ్చాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి ఉండదని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు లోకసభ ఎన్నికల సందర్భంగా పదే పదే ప్రచారం నిర్వహించారు. కాగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆరు మాసాలకే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఆ పార్టీకి ఊరటనిచ్చింది.
అంతే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే బీఆర్ఎస్ గెలుపొందడం మరింత ఊరట ఇచ్చింది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సైతం ప్రచారం నిర్వహించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
MOST READ :
Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా..? ఉంటే ప్రతి నెల రూ. 5 వేలు పొందవచ్చు, మీరు తెలుసుకోండి..!
Nalgonda : నల్గొండ జిల్లాలో ముగ్గురు తహసిల్దార్లు, ఒక విఆర్ఓ అరెస్ట్..?









