Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో ముగ్గురు తహసిల్దార్లు, ఒక విఆర్ఓ అరెస్ట్..?

Nalgonda : నల్గొండ జిల్లాలో ముగ్గురు తహసిల్దార్లు, ఒక విఆర్ఓ అరెస్ట్..?

మన సాక్షి , నల్గొండ :

నల్గొండ జిల్లాలో ముగ్గురు తహసిల్దార్ లను, ఒక విఆర్వోను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. వివరాల ప్రకారం నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో అసైన్డ్ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని అభియోగంతో ముగ్గురు తహసిల్దార్లను, విఆర్ఓ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

నిడమనూరు మండలం తుమ్మడం శివారులోని 9 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆసైన్డ్ కమిటీ తీర్మానం లేకుండానే పలువురికి పట్టాలు చేసినట్లు తెలిసింది. అందులో వీఆర్వో వద్ద బినామీగా ఉన్న ఒక వ్యక్తి భార్య , తండ్రి పేరిట అక్రమంగా పట్టా చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. మారుతివారి గూడెంకు చెందిన పలువురు ప్రభుత్వ భూములను పట్టాలు చేయించుకున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు.

కాగా మారుతివారి గూడెం వాసి, న్యాయవాది మారుతి వెంకట్ రెడ్డి రెండు సంవత్సరాల క్రితం ఈ విషయంపై హైకోర్టులో పిల్ వేశారు. అందుకు స్పందించిన కోర్టు సమగ్ర విచారణ చేసి వివరాలను అందజేయాలని కోరింది. అప్పటి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కూడా విచారణకు చేపట్టారు. ఈ విషయంపై 2022లో నిడమనూరు పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయింది. ఈ కేసును నల్లగొండ కు బదిలీ చేశారు. కాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు సమగ్రంగా విచారించి అప్పట్లో పని చేసిన ముగ్గురు తహసిల్దార్లను, తుమ్మడం వీఆర్వో నుఅరెస్ట్ చేసినట్లు సమాచారం.

MOST READ : 

BREAKING : నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ప్రైవేట్ క్లినికులపై ఆకస్మిక తనిఖీలు.. 55 మంది ఆర్ఎంపీ, పీఎంపీలపై కేసులు..!

BREAKING : పోలీసుల అదుపులో కెనరా బ్యాంక్ గోల్డ్ అప్రైజర్..?

BREAKING : నల్గొండ డిటిసి ఆఫీసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు. ఏజెంట్ల ద్వారా పనులు చేయీస్తున్న అధికారులు..!

మరిన్ని వార్తలు