TOP STORIESBreaking Newsజాతీయం

Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్స్ కు భారీ షాక్.. ఫిబ్రవరి నుంచి కొత్త రూల్స్.. మీకు తెలుసా..!

Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్స్ కు భారీ షాక్.. ఫిబ్రవరి నుంచి కొత్త రూల్స్.. మీకు తెలుసా..!

మన సాక్షి,

డిజిటల్ లావేదేవీలు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది కొనసాగిస్తున్నారు. భారతదేశంలో కూడా ఎక్కువగా డిజిటల్ లావాదేవీల వైపే వెళుతున్నారు. యూపీఐ లావాదేవీలు కేవలం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సైతం వినియోగిస్తున్నారు. కూరగాయల కొనుగోలు నుంచి పెద్దపెద్ద వస్తువుల కొనుగోలు కూడా యూపీఐ ద్వారానే చెల్లింపులు కొనసాగుతున్నాయి.

అయితే UPI లావాదేవీలను కొన్నింటిని తిరస్కరించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్ణయించింది. అందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. నూతన మార్గదర్శకాలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. వాటిలో ఎన్ పి సి ఐ రూల్స్ ప్రకారం లేకుంటే లావాదేవీలను నిలిపివేస్తారు.

ముఖ్యంగా ఎన్ పి సి ఐ నిబంధనల ప్రకారం ఆల్ఫా న్యూమరికల్ అక్షరాలను ఉపయోగించి ఐడీలను పెట్టుకొని వినియోగించే వారికి మాత్రమే యూపీఐ లావాదేవీలు కొనసాగుతాయి. లేదంటే ప్రత్యేక అక్షరాలతో ఐడి ఉన్న వారి లావాదేవీలు పూర్తిగా నిలిపివేయబడతాయి. వారి గుర్తింపు కార్డులు కూడా బ్లాక్ చేయబడతాయి.

ప్రత్యేక అక్షరాలతో లావాదేవీలు ఉన్నవారు వెంటనే మార్చుకోవాల్సి ఉంది. లేదంటే వారి లావాదేవీలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నిలిపివేయబడతాయి. ఆల్ఫా న్యూమరికల్ అక్షరాలు అంటే A – Z వీటిలో ఏవైనా ఉపయోగించి ఐడి ఉండొచ్చు. కానీ ప్రత్యేక అక్షరాలు అంటే @ # % & ! $ ¥ £ € ఇవి ఇలాంటి ఐడీలతో లావాదేవీలు జరిపే అవకాశం లేదు.

Similar News :

  1. UPI : ఫిబ్రవరి 1 నుంచి ఆ యూపీఐ లావాదేవీల నిలిపివేత.. ఫోన్ పే, జి పే వినియోగదారులు తెలుసుకోవల్సిందే..!

  2. Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు జాగ్రత్త.. ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ.. అందరు తెలుసుకోవాల్సిందే..!

  3. Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!

  4. Phonepe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి అదిరిపోయే శుభవార్త.. ఇది అస్సలు మిస్ చేసుకోకండి..!

 

మరిన్ని వార్తలు