Breaking NewsTOP STORIESక్రైంతెలంగాణనల్గొండరాజకీయం
నల్లగొండలో బీఆర్ఎస్ నేతలకు చేదు అనుభవం..!
నల్లగొండలో బీఆర్ఎస్ నేతలకు చేదు అనుభవం..!
నల్లగొండ , మన సాక్షి :
నల్లగొండలో టిఆర్ఎస్ నేతలకు చేదు అనుభవం ఎదురయింది. నల్లగొండలో బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్తున్న మాజీ మంత్రుల బస్సు పై ఎన్ఎస్ఐ కార్యకర్తలు కోడిగుడ్ల దాడి జరిగింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులు బహిరంగ సభకు వెళుతుండగా నల్గొండ పట్టణంలోని వీటి కాలనీలో కొంతమంది కోడిగుడ్లతో బస్సు పై దాడి చేశారు.
గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నల్ల చొక్కాలు ధరించి బస్సుకు అడ్డగించే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఎన్ఎస్ఐ కార్యకర్తలను అడ్డుకోగా బస్సు వెళ్ళిపోయింది. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు గో బ్యాక్ అంటూ నినాదాలు చేసిన ఎన్ఎస్ఐ కార్యకర్తలు.









