బిజెపి, బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిక
తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే - చల్లమల్ల కృష్ణారెడ్డి

బిజెపి, బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిక
తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే – చల్లమల్ల కృష్ణారెడ్డి
చౌటుప్పల్. మన సాక్షి.
తెలంగాణలో రాబోవు కొద్ది రోజుల్లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పీసీసీ ప్రధాన కార్యదర్శి మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండల కేంద్రం పీపల్ పహాడ్ గ్రామానికి చెందిన పలువురు యువకులు బిజెపి, బిఆర్ఎస్ పార్టీల నుండి కార్యకర్తలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో చలమల్ల కృష్ణారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి ఆదివారం చేరారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులకు చల్ల మల్ల కృష్ణారెడ్డి కండువా కప్పి పార్టీలోకి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా చలమల్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నా రక్తమని, కార్యకర్తలే నాకు ప్రాణమని, పార్టీ నాకుటుంబమని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు వస్తున్న ఆదరణ చూడలేక కావాలనే పనిగట్టుకుని కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో చెరుకు మహేష్, రాచకొండ శ్రీనుచారి, వరి కుప్పల మహేష్, మారగొని గణేష్, ఎర్ర నరేష్, ముంత భాస్కర్, సిలువేరు రమేష్, గణేష్ లు ఉన్నారు.
చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు నల్లింకి వెంకటేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, బ్లాక్ ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీహరి ,కార్యదర్శి చాలప నరసింహ ,రాజుయాదవ్, గ్రామ శాఖ అధ్యక్షులు అరుణ్ ,ఉపాధ్యక్షులు ఎర్ర నాగరాజు తదితరులు పాల్గొన్నారు.