అర్వింద్ సమక్షంలో బీజేపీలో చేరిన టిడిపి నేత

అర్వింద్ సమక్షంలో బీజేపీలో చేరిన టిడిపి నేత

జగిత్యాల,(మన సాక్షి):

మోడీ పాలనకు, బిజెపి విధానాలకు ఆకర్షితులై సీనియర్ టిడిపి నాయకులు ఎల్.శేఖర్ ఎంపీ అర్వింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. బుధవారం జగిత్యాల లో కురుమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాలలో పాల్గొనేందుకు జగిత్యాల కు వచ్చిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మొదట పార్టీ కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేశారు.

 

ఈ సందర్భంగా ఎల్.శేఖర్ బిజెపి పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఎంపీ అర్వింద్ బిజెపి కండువా కప్పి ఎలగందుల శేఖర్ ను బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎల్.శేఖర్ మాట్లాడుతూ పార్టీ నియమ నిబంధనలకు లోబడి మనస్ఫూర్తిగా పనిచేస్తానని, పార్టీ బలోపేతానికి నిరంతర కృషి చేస్తానని అన్నారు.

 

తన చేరికకు కృషి చేసిన బిజెపి జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు, బోగ శ్రావణి ప్రవీణ్, తుల ఉమ, రాగిల్ల సత్యనారాయణ, పట్టణ అద్యక్షులు వీరబత్తిని అనీల్, పవన్ సింగ్ లకు ఎల్.శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.