క్రైంBreaking Newsతెలంగాణములుగు జిల్లా

Karreguttalu : కర్రెగుటల్లో బాంబుల మోత.. 38 మంది మావోల మృతి..!

Karreguttalu : కర్రెగుటల్లో బాంబుల మోత.. 38 మంది మావోల మృతి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ – చత్తీస్గడ్ సరిహద్దుల్లోని కర్రెగుటల్లో బాంబుల వర్షం కురిసింది. భద్రత బలగాలు బాంబులు కురిపించాయి. సుమారు 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో ఓ జవాన్ కు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం గుట్టల్లో కాల్పులు కొనసాగుతున్నాయి.

కర్రెగుట్టలే టార్గెట్గా భద్రత బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. దండకారణ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొన్నది. నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున కుంభింగ్ కొనసాగుతుంది. మావోయిస్టులకు పెట్టని కోటలాగా కర్రెగుట్టల ప్రాంతం ఉంది. కాగా భద్రత బలగాలు మోహరించాయి.

అక్కడ మావోయిస్టులు కూడా భారీ సంఖ్యలో ఉన్నట్లు గుర్తించాయి. దాంతో కర్రెగుటల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. మూడు వైపుల నుంచి భద్రత బలగాలు చుట్టుముట్టాయి. కొద్దిరోజులుగా ఈ గుట్టలో మావోయిస్టుల వేట కొనసాగుతుంది. అధునాతన ఆయుధాలతో బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటివరకు 38 మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది.

MOST READ :

  1. Mavoist : విద్యాసంస్థలపై మావోయిస్టుల కీలక ప్రకటన ..!

  2. mavoist : మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన కరపత్రాలు..!

  3. Mavoist : పుట్టపాడు ఎన్కౌంటర్ పై మావోయిస్టుల కీలక ప్రకటన

  4. Big Alert : ఈ పేరుతో ఫోన్ కాల్స్, వాట్సప్ మెసేజ్ లు వస్తే జాగ్రత్త.. లేదంటే మీ ఖాతా ఖాళీ..!

మరిన్ని వార్తలు