Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

Mavoist : విద్యాసంస్థలపై మావోయిస్టుల కీలక ప్రకటన ..!

Mavoist : విద్యాసంస్థలపై మావోయిస్టుల కీలక ప్రకటన ..!

మావోయిస్టు పార్టీ ఆజాద్ హెచ్చరిక

చర్ల,మనసాక్షి:

విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ అడ్డగోలుగా ఫీజుల పేరుట డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థల తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు అంటూ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరిట శనివారం లేక విడుదల చేశారు.

 

ఈ లేక లో అధిక ఫీజులతోపాటు పుస్తకాల రేట్లు పెంచడం జరుగుతుందని వసతుల పేరిట దోపిడీ దౌర్జన్యం జరగుతుందని పాఠశాలలలోనే పుస్తకాల విక్రయాలు జరుగుతున్నాయని అలాంటి విద్యా సంస్థలపై చర్యలు తప్పకుండా తీసుకోబడతాయని ఆ లేఖలో పేర్కొన్నారు .

 

అంతేకాకుండా ప్రైవేటు విద్యాసంస్థలు పాటించవలసిన నిబంధనల ను విడుదల చేసిన లేక ద్వారా వివరిస్తూ ప్రతిష్టంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని నోటీసు బోర్డులో ఫీజుల వివరాలు తెలపాలని ఎగ్జామ్ ఫీజులు నోటీసు బోర్డులో పెట్టాలని ప్రైవేటు విద్యాసంస్థలలో క్వాలిఫై టీచర్స్ ని నియమించాలని ఉపాధ్యాయులకు కనీస వేతనాలు ఇవ్వాలని ..

 

ప్రైవేటు విద్యాసంస్థలపై డీఈవో ఎం ఈ ఓ ల పర్యవేక్షణ ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ఇంజనీరింగ్ కాలేజీలు ఐటిఐ కాలేజీలు ఫార్మసీ కాలేజీలు ఇంటర్మీడియట్ డిగ్రీ ఒకేషనల్ కాలేజీలలో ఫీజుల దోపిడీ ఆపాలని విద్యా ఏజెన్సీ చట్టాలను అమలు చేయాలని పేద విద్యార్థిని విద్యార్థులకు రాయితీలు ఇవ్వాలని ఫిట్నెస్ బస్సుల్ని నడపాలని ప్రవేట్ స్కూళ్లలో కాలేజీలలో పుస్తకాలు ను యూనిఫార్మ్స్ ను అమ్మ రాదని.

 

ఈ సమస్యలను విద్యాశాఖ అధికారులు పట్టించుకోవాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సరైన సౌకర్యాలు లేక పాఠశాలలో కళాశాలలో సరి అయిన రిజల్ట్ రాక ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.

 

ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు కళాశాలలో ఉన్న లెక్చరర్స్ పోస్టులు భర్తీ చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ విద్య సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని మావోయిస్టు పార్టీ ఆజాద్ ఆ లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు