Mavoist : పుట్టపాడు ఎన్కౌంటర్ పై మావోయిస్టుల కీలక ప్రకటన

Mavoist : పుట్టపాడు ఎన్కౌంటర్ పై మావోయిస్టుల కీలక ప్రకటన

చర్ల,మనసాక్షి:

తెలంగాణ ఛతిస్గడ్ బోర్డర్ పుట్టపాడు అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్ ఒట్టి బూటకం అని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు భద్రాద్రి కొత్తగూడెం అల్లూరు సీతారామరాజు డివిజన్ కమిటీ బి కే ఏ ఎస్ ఆర్ కార్యదర్శి ఆజాద్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

 

నిరాయుదుడిని పట్టుకొని చిత్రహింసలు చేసి కాల్చి చంపారని ఇది సరైన పద్ధతి కాదని ఆజాద్ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. కామ్రేడ్ రాజేష్ నిరాయుధంగా పార్టీ పనుల రిత్యా ఒక్కడే పుట్టపాడు గ్రామానికి వెళ్ళాడని ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో పట్టుకొని చిత్రహింసలు చేసి కాల్చి చంపారని ఇది నిజమైన ఎన్ కౌంటర్ అని నమ్మించడానికి తమతో పాటు తెచ్చుకున్న ఎస్ఎల్ఆర్ తుపాకీని పెట్టి అదే పుట్టపాడు గ్రామానికి చెందిన నందాలు అనే ఆదివాసిని కూడా కాల్చి చంపారని ఆజాద్ లేక ద్వారా పేర్కొన్నారు.

ఒక నిరాయుధుడిని ఒక అమాయకపు ఆదివాసిని పట్టుకొని చంపి దానికి ఎన్కౌంటర్ అని రంగు పులిమారని ఆయన లేక ద్వారా అన్నారు. ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా ఈ చర్యలను ఖండించాలంటూ ఆజాద్ లేక ద్వారా తెలిపారు.

 

ఈ హత్యకు పూర్తి బాధ్యత టిఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీస్ అధికారులే బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ ఆజాద్ ఆదివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.