తెలంగాణBreaking News

BREAKING : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పొడిగింపు..!

BREAKING : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పొడిగింపు..!

మన సాక్షి తెలంగాణ బ్యూరో

అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో సమావేశాలు ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ముందుగా ఈనెల 31వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశాల్లో చర్చించేందుకు కేవలం నాలుగు రోజులు మాత్రమే నిర్వహిస్తున్నారని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. బడ్జెట్ పై చర్చ ఎక్కువ రోజులు గడువు ఉండాలని బీఆర్ఎస్, బిజెపి నుంచి కూడా విమర్శలు వచ్చాయి. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలను ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగించింది.

సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, విమర్శలతో జోరుగా సాగుతున్నాయి. ఈనెల 25వ తేదీన రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. 26వ తేదీన సెలవు ఉండడంతో 27వ తేదీన బడ్జెట్ పై సాధారణ చర్చ తో పాటు డిప్యూటీ సీఎం సమాధానం చెప్పనున్నారు. ఆ తర్వాత 28వ తేదీన తిరిగి అసెంబ్లీ సమావేశాలకు సెలవు ఉండడంతో 29న 19 పద్దులపై చర్చ తో పాటు ఆమోదం కూడా ఉంటుంది. ఈనెల 30వ తేదీన మరో 19 పద్ధులపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. అదేవిధంగా 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లు పై చర్చ ఆమోదం జరగనున్నాయి. ఆగస్టు 1,2 తేదీలలో ప్రభుత్వ ఎజెండా బిల్లులపై చర్చ చేపట్టనున్నారు.

ALSO READ : 

మరిన్ని వార్తలు