BREAKING : రిజర్వాయర్‌లో యువకుడి మృతదేహం.. మిర్యాలగూడ వాసి గా గుర్తింపు..!
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు రిజర్వాయర్‌లో శనివారం ఒక యువకుడి మృతదేహం లభ్యమయింది.

BREAKING : రిజర్వాయర్‌లో యువకుడి మృతదేహం.. మిర్యాలగూడ వాసి గా గుర్తింపు..!
గరిడేపల్లి, మన సాక్షి
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు రిజర్వాయర్‌లో శనివారం ఒక యువకుడి మృతదేహం లభ్యమయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.
మృతుడి వివరాలు:
మృతుడిని నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఏషాల సతీష్ (37) గా గుర్తించారు. ఇతని తండ్రి పేరు మట్టయ్య. మృతుడు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా పోలీసులు ధృవీకరించారు.
ఘటన నేపథ్యం:
రిజర్వాయర్ నీటిలో మృతదేహం తేలుతూ ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సతీష్ మృతదేహాన్ని బయటకు తీయించి, పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సతీష్ మిర్యాలగూడ నుండి ఇక్కడికి ఎలా వచ్చాడు? ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణమా లేక ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు ఎస్ఐ చల్లి కంటి నరేష్ తెలిపారు.









