Viral Video : అమ్మాయికి మెసేజ్ చేశాడని.. ముగ్గురు యువకుల పాశవిక దాడి.. (వీడియో)
Viral Video : అమ్మాయికి మెసేజ్ చేశాడని.. ముగ్గురు యువకుల పాశవిక దాడి.. (వీడియో)
మన సాక్షి :
ఓ అమ్మాయికి మెసేజ్ చేశాడని ముగ్గురు యువకులు అతడిని వాసవికంగా దాడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కళాశాలలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి.
ఆ అమ్మాయి వైపు చూడొద్దని, మల్లోసారి మెసేజ్ పెట్టొద్దని హీరోలాగా ఫీల్ అయి అతడిని చితక్కబడుతుంటారు. ఇలాంటి సంఘటన ఒకటి ఆంధ్ర ప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. ఒక యువకుడు అమ్మాయికి మెసేజ్ చేశాడని చెట్లలోకి తీసుకెళ్లి ఇష్టమొచ్చినట్లు కొట్టారు. అతని బట్టలు చింపి కొబ్బరి మట్టలతో దాడులు చేశారు. ఈ సంఘటన నవంబర్ 5వ తేదీన జరిగినట్లుగా తెలుస్తుంది.
బాధితుడు మలికిపురం లోని జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు సమాచారం. ఒక యువతికి మెసేజ్ చేసిన విషయంలో వాగ్వివాదం చోటుచేసుకోగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఆ యువకుడిని మాట్లాడుకుందాం అని చెప్పి చెట్లల్లోకి తీసుకెళ్లి దారుణంగా కొట్టారు.
అంతేకాకుండా అతడిని కొడుతున్నది రికార్డు చేశారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇది పెను దుమారం చెలరేగింది. బాధితుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా దాడికి పాల్పడిన వారిలో ఒక యువకుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు కూడా సమాచారం.
VIDEO
అమ్మాయికి మెసేజ్ చేశాడని యువకుడిపై ముకుమ్మడిగా పాశవికంగా దాడి చేసిన ముగ్గురు యువకులు
బాధితుడు ఈస్ట్ గోదావరి జిల్లా మలికిపురం AFDT జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి అని సమాచారం pic.twitter.com/ruBoFWrQMl
— Telugu Scribe (@TeluguScribe) November 20, 2024
MOST READ :
Gold Price : పసిడి ప్రియులకు భారీ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!
Gold Price : పసిడి ప్రియులకు భారీ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!
Gold Price : వరుసగా మూడో రోజు.. చుక్కలు చూపిస్తున్న బంగారం ధర..!
Miryalaguda : రేషన్ డీలర్ కోసం దరఖాస్తుల గడువు పొడిగింపు..!









