Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Nelakondapalli : కోలాహాలంగా ఎద్దుల పోటీలు..! 

Nelakondapalli : కోలాహాలంగా ఎద్దుల పోటీలు..! 

నేలకొండపల్లి, మన సాక్షి :

ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని రాజేశ్వరపురం లో ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు బుధవారం కోలాహాలంగా జరిగాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా గ్రామంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఒంగోలు జాతి ఎద్దుల బలప్రదర్శన పోటీలను నిర్వహించారు.

ఈ పోటీలకు మంచి స్పందన లభించింది. రెండో రోజు నాగులు పళ్ల విభాగంలో నిర్వహించిన పోటీలలో గుంటూరు జిల్లా, మాచారం కు చెందిన అత్తులూరి లక్ష్మి తిరుపతమ్మ జత ప్రధమ స్థానం సాధించింది.

తోట రావులపాలెం కు చెందిన భాను నాయుడు ద్వితీయ స్థానం, ప్రకాషం జిల్లా, రాచర్ల కు చెందిన లింగాసాయినాడు తృతీయ స్థానం, పల్నాడు కు చెందిన అంజిరెడ్డి జత నాలుగో స్థానం, సూర్యాపేట జిల్లా లోని మేళ్లచెరువు కు చెందిన కార్తీక్డ్డి ఐదో స్థానం.

నేలకొండపల్లి మండలం లోని కట్టుకాచారం గ్రామానికి చెందిన ఏటుకూరి సీతారామయ్య జత ఆరో స్థానం కొణిజర్ల మండలం లోనిదిద్దుపూడి కి చెందిన పుల్లారావు జత ఏడో స్థానం సాధించారు.

వీరికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సోసైటీ చైర్మన్ తన్నీరు కృష్ణమూర్తి, ఎర్రబోయిన నర్సయ్య, చిట్యాల రమేష్, కడియాల నరేష్, దండా సత్యనారాయణ, ఇస్లావత్ బాలాజీ, దండా వెంకటేశ్వర్లు, .ఆర్. నవీన్, కె.ఉపేందర్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు