Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Komatireddy Venkatreddy : జిల్లా కలెక్టర్ పై దాడికి పాల్పడిన వారు కేటీఆర్ తో కూడా టచ్ లోనే..!

Komatireddy Venkatreddy : జిల్లా కలెక్టర్ పై దాడికి పాల్పడిన వారు కేటీఆర్ తో కూడా టచ్ లోనే..!

నల్లగొండ, మన సాక్షి.

కొడంగల్ నియోజకవర్గంలో  ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర పై దాడి చేయడం అమానుషమని,
దాడి చేసిన వారిని ఎంతటి వారినైనా వదిలిపెట్టమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.

బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
దాడికి ప్రోత్సహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను, పాల్గొన్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
అధికారం కోల్పోవడంతో ప్రెస్టేషన్లో బీఆర్ఎస్ నేతలు ఇలాంటి దాడులకు ప్రోత్సహిస్తున్నారని,
దాడికి పాల్పడిన నేతలు ఫోన్లో కేటీఆర్ తో కూడా టచ్ లోనే ఉన్నారని తెలిపారు.

భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నవాళ్లు జైలు ఊసలు లెక్క పెట్టాల్సిందే అన్నారు.
వారు ఎక్కడ దాక్కున్నా.. రప్పించి జైలుకు పంపిస్తాం అని తెలిపారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేయవచ్చుకానీ కలెక్టర్ పై దాడులకు పాల్పడడం సరైన పద్ధతి కాదు అన్నారు. రాష్ట్రంలో ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ పత్తి కొనుగోలుపై నోరు మెదపడం లేదన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నప్పటికీ కనీసం పత్తికి మద్దతు ధర గురించి కేంద్ర మాట్లాడటం లేదు అని విమర్శించారు.  మూసి ప్రక్షాళను అడ్డుకుంటామని మాట్లాడుతున్నారు తప్ప రైతుల గురించి మాట్లాడటం లేదన్నారు.

ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొందరు రైస్ మిల్లర్ల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, వారం రోజులలో మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తాం అన్నారు.
రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందుల గురిచేస్తే సహించేది లేదు అని హెచ్చరించారు. నాగార్జునసాగర్ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే రైతులు వరి కోతలు ప్రారంభించారని,
రైస్ మిల్లర్లతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

MOST READ : 

మరిన్ని వార్తలు