బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి 

బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి 

దేవరకొండ , మనసాక్షి:

దేవరకొండ పట్టణంలోని సంతోషమాత కాలనీకి చెందిన అంకురి సురేష్ తన సోదరుడి రమేష్ వివాహం ఈనెల ఐదున కావడంతో శుభలేఖలను పంచడానికి మంగళవారం హైదరాబాద్ ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.

 

ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద వేగంగా వస్తున్న బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. పెళ్ళింట విషాద ఛాయలు అలముకున్నాయి.

 

సోదరుడు రమేష్ దేవరకొండ పట్టణంలోని కలెక్షన్ బాయి గా పనిచేస్తున్నారు. మృతునికి తల్లి తో పాటు, రమేష్, సోదరి ఉన్నారు.