Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయంవ్యవసాయం

Miryalaguda : మిల్లర్లు ధాన్యం కొనుకుంటే నాకు ఫోన్ చేయండి.. ఎమ్మెల్యే బిఎల్ఆర్..!

Miryalaguda : మిల్లర్లు ధాన్యం కొనుకుంటే నాకు ఫోన్ చేయండి.. ఎమ్మెల్యే బిఎల్ఆర్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ప్రస్తుత వానా కాలపు సీజన్ లో ధాన్యం కొనుగోళ్ల విషయంపై రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సన్నధాన్యం పండించిన రైతులు ఎక్కువగా రైస్ మిల్లులకే విక్రయిస్తున్నారు. ఒక్కో రైస్ మిల్లు వద్ద సుమారుగా 30కి పైగా ధాన్యం ట్రాక్టర్లు నిలిచి ఉన్నాయి. దాంతో మిల్లర్లు ధాన్యం కొనుగోలు విషయంలో జాప్యం చేయడంతో పాటు మద్దతు ధర చెల్లించడం లేదు. కనీస మద్దతు ధర చెల్లించకపోవడంతో రైతులు ఆందోళనలు చేస్తున్నారు.

ఈ విషయంపై ఆదివారం స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి రైస్ మిల్లులను సందర్శించారు. రైతులతో పాటు మిల్లర్లు, గుమస్తాలతో మాట్లాడారు. ఖచ్చితంగా రైతుల ధాన్యానికి మద్దతు ధర చెల్లించాల్సిందే అని ఆదేశించారు. మద్దతు ధర చెల్లించని మిల్లులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కూడా నేరుగా మిల్లులు, ఐకెపి కేంద్రాలలో దాన్యం విక్రయించుకోవాలని, మధ్యవర్తులను నమ్మొద్దని పేర్కొన్నారు.

అదే విధంగా మిల్లుల వద్దకు రైతులు తీసుకువచ్చిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించకపోయినా.. అసలు ధాన్యం కొనుగోలు చేయకపోయినా.. నేరుగా తనకే ఫోన్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా తన ఫోన్ నెంబర్ ను రైతులకు తెలియజేశారు. తనకు ఫోన్ చేస్తే మిల్లు వద్దకు రైతుల తరఫున వ్యవసాయాధికారులతో వచ్చి చెక్ చేస్తామని పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు