Breaking Newsతెలంగాణవిద్య

Holidays : వరుస సెలవుల్లో ఆరోజు రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Holidays : వరుస సెలవుల్లో ఆరోజు రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

పాఠశాల విద్యార్థులకు వరుసగా సెలవులు వచ్చాయని ఎగిరి గంతేశారు. ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు వరుసగా ఈ నెలలో నాలుగు రోజులు సెలవులు వచ్చాయని విద్యార్థులు ఆనందంలో మునిగిపోయారు.  కానీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థుల ఆశలు అడియాశలు అయ్యాయి. వరుసగా ఉండే నాలుగు రోజులు సెలవుల్లో ఒక రోజును సెలవులు రద్దు చేసింది.

వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 14వ తేదీ, 15వ తేదీ రెండవ శనివారం, ఆదివారం సెలవులు వచ్చాయి. దాంతోపాటు 16వ తేదీన మిలాద్ ఉన్ నాబీ పండుగ సెలవు, 17వ తేదీన వినాయక నిమజ్జనం సెలవు.. నాలుగు రోజులు వరుసగా వచ్చాయి. కానీ నెలవంక కనిపించే తేదీ మారడంతో మిలాద్ ఉన్ నబీ పండుగ తేదీ మారింది. 17వ తేదీన ఆ పండగ జరుపుకోవాలని నిర్ణయించారు.

దాంతో 16వ తేదీ సెలవును ప్రభుత్వం రద్దు చేసింది. 17వ తేదీన మిలాద్ ఉన్ నబీ తో పాటు గణేష్ నిమజ్జనం సెలవు కూడా ఉంటుంది. కానీ గణేష్ నిమజ్జన ఊరేగింపు ఈనెల 19వ తేదీకి వాయిదా వేయబోతున్నట్లు సమాచారం.. ఒకవేళ 19కి వాయిదా వేస్తే ప్రభుత్వం సెలవు ప్రకటిస్తుందా..? లేదా..? అనేది వేచి చూడాల్సి ఉంది.

LATEST UPDATE :

బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?

Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో నేటి నుంచి రూ.10వేలు..!

మరిన్ని వార్తలు